Type Here to Get Search Results !

ap-all-schools-from-november-2nd-class-9th-10th-syllabus-2020-21

ap-all-schools-from-november-2nd-class-9th-10th-syllabus-2020-21


*️విద్యాసంస్థలు ఓపెన్... షెడ్యూల్ విడుదల



కోవిడ్‌ నేపథ్యంలో 2వ తేదీ నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు


విద్యార్థులు, టీచర్లకు ఇబ్బంది కలగకుండా చర్యలు


ఒక్కో విద్యార్థి మధ్య దూరం 6 అడుగులు


టెన్త్‌ మినహా తక్కిన విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు


టీచర్లు రోజూ స్కూళ్లకు రావలసిందే


రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది.


కోవిడ్‌–19 నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు.


ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు.


ఒక్కో విద్యార్థికి మధ్య దూరం 6 అడుగులు ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.  


నవంబర్‌ నెలంతా హాఫ్‌ డే స్కూళ్లే


► నవంబర్‌ నెలంతా స్కూళ్లు హాఫ్‌డే మాత్రమే (ఉదయం 9 నుంచి 1.30 వరకు) ఉంటాయి. మధ్యాహ్న భోజనం ముగిశాక పిల్లలను ఇళ్లకు పంపిస్తారు.


► విద్యార్థులు రోజు విడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా ఏర్పాట్లు.


► ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు తరగతులు పెట్టాలి


► నవంబర్‌ 23 నుంచి 6, 8 తరగతులకు ఒకరోజు, 7, 9 తరగతులకు మరునాడు తరగతులు నిర్వహించాలి.


► డిసెంబర్‌ 14 నుంచి 1, 3, 5, 7, 9 తరగతులకు ఒకరోజు, 2, 4, 6, 8 తరగతులకు మరుసటిరోజు తరగతులు పెట్టాలి.


► టెన్త్‌ విద్యార్థులకు ప్రతి రోజూ తరగతులు నిర్వహించాలి.


► ఏ స్కూలులో అయినా 750 మందికి మించి విద్యార్థులున్నట్లయితే వారిని మూడు బ్యాచులుగా చేసి మూడేసి రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలి.


► టీచర్లు రోజూ స్కూళ్లకు హాజరవ్వాలి.


ఉదయం తరగతుల బోధన, మధ్యాహ్నం ఆన్‌లైన్‌ బోధనలో పాల్గొనాలి.


అకడమిక్‌ క్యాలెండర్‌ ఇలా..


► రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను అన్ని పాఠశాలలు అనుసరించాలి.


► నవంబర్‌ 2 నుంచి 2021 ఏప్రిల్‌ 30 వరకు మొత్తం 180 రోజులకు తగ్గట్టుగా క్యాలెండర్‌ ఉంటుంది. 


► ఆదివారాలు, సెలవు దినాల్లో స్కూళ్లు మూసిఉన్న రోజుల్లో పిల్లలు ఇంటినుంచే చదువుకొనేలా ప్రణాళిక ఉంది. 


► తల్లిదండ్రుల కమిటీలతో సంప్రదించి ప్రతి రోజూ స్కూళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. 


► పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగేందుకు తగిన పౌష్ఠికాహారం మధ్యాహ్న భోజనం ద్వారా అందించాలి. మధ్యాహ్న భోజనం అమలులో కోవిడ్‌ జాగ్రత్తలు పూర్తిగా తీసుకోవాలి. మూడో వంతు మంది చొప్పున విడతల వారీగా పంపాలి.


► ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా, సామాజిక దూరం పాటించేలా చూడాలి.


► ఉదయం స్కూళ్లు తెరవగానే  కోవిడ్‌ ప్రతిజ్ఞ చేయించి జాగ్రత్తలపై 15 నిమిషాలు బోధించాలి.


10TH CLASS SYLLABUS 


TELUGU


TELUGU NON DETAILED


COMPOSITE TELUGU


SANSKRIT


HINDI


ENGLISH










9TH CLASS SYLLABUS 


TELUGU


SANSKRIT & COMPOSITE TELUGU


HINDI


ENGLISH


మిగిలిన 9TH & 10TH CLASSES ALL SUBJECTS SYLLABUS


హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్వహణ ఇలా..


► హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లను అక్కడి వసతిని బట్టి నిర్ణీత నిబంధనలను పాటిస్తూ 9–12 తరగతుల పిల్లలతో నవంబర్‌ 2వ తేదీనుంచి ప్రారంభించవచ్చు.


► నిబంధనలకు అనువుగా తగినంత వసతి లేని పక్షంలో నవంబర్‌ 23 నుంచి ప్రారంభించాలి.


► అప్పటివరకు ఆ విద్యార్థులు సమీపంలోని ప్రభుత్వ స్కూళ్లలోని తరగతులకు హాజరవ్వడం లేదా ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా ఆయా పాఠ్యాంశాలు నేర్చుకొనేలా చూడాలి.


► 3 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించి నిబంధనలు తరువాత విడుదల చేస్తారు.


అప్పటివరకు ఈ విద్యార్థులు సమీపంలోని స్కూళ్లలోని తరగతులకు హాజరై అక్కడ మధ్యాహ్న భోజనం తీసుకోవచ్చు.


నవంబర్  2 నుండి  స్కూల్స్  తెరిచి  నప్పుడు  తీసుకోవలసిన  జాగ్రత్తలను  వివరించారు.  వానిలో  కొన్ని ముఖ్యమైనవి.*


*1). 1, 3, 5, 7 తరగతులు  ఒక  రోజు,  2, 4, 6, 8 తరగతులు  ఒక రోజు,  9, 10 తరగతులకు  ప్రతి  రోజు  ఉదయం  9 గంటల నుండి  మధ్యాహ్నం  1 గంటలవరకు  తరగతులను  నిర్వహించాలి.*


*2. పిల్లలు  స్కూల్  లోనికి  వచ్చేటప్పుడు  థర్మల్  స్క్రీనింగ్  చేసి  లోపలికి  అనుమతించాలి.*


*3. మాస్క్  లేకపోతే  అనుమతించ రాదు.*


*4. క్లాస్ లో  పిల్లలు 20 మంది  లోపే  ఉండాలి.*


*5. స్కూల్  లోని  తరగతి  గదులను  ప్రతిరోజు  శానిటేషన్  చేయించాలి.*


*6. 1st  పీరియడ్  లో  మరియు  లాస్ట్  పీరియడ్ లో  ప్రతిరోజూ  10 నిమిషాలు  Covid 19 పై  పిల్లలకు  అవగాహన  కల్పించాలి.*


*7. స్కూల్  ఎంట్రెన్స్ లో, తరగతి  గదులలో, ముఖ్యమైన  ప్రదేశాలలో  Covid19  నివారణకు  తీసుకోవలసిన స్లొగన్స్ ను  ప్రదర్శించాలి.*


*👇అవి.*


 *A) మాస్క్  లేదు,  ప్రవేశం లేదు.*


*B) 6 అడుగులు  బౌతిక  దూరం  పాటిద్దాము.*


*C) తరసూ   చేతుల  సబ్బు  నీటితో  కడుగుకుందాం. మోడల్  పోస్టర్  లను  M E  O లు  ప్రతి  స్కూల్  కి  ఒకటి  ఇస్తారు.*


*8. పిల్లలు  బుక్స్  కాని  పెన్నులు  కాని  ఒకరివి  మరొకరు  మార్చుకోకుండా  చూడాలి.* 


*9. ప్రతి  విద్యార్థి నోట్స్  కరెక్ట్ చేయకుండా  బోర్డు  పై  వ్రాసి  Self  కరెక్షన్  ప్రోత్సహింస  వలయును.*


*10. పేరెంట్స్  నుండి  Willing  లెటర్  కచ్చితంగా  తీసుకోవాలి.*


*11. Staff  అందరు  ఆరోగ్యసేతు  అప్  డౌన్లోడ్  చేసుకోవాలి.* 


*12. స్కూల్  లో  ఒక  Isolation  రూమ్  ఏర్పాటు  చేసుకో వాలి.* 


*13. పిల్లలు  చేతులతో  ముక్కు,  నోరు,  కళ్ళు ఎక్కువగా  తాకవద్దని  తెలియచేయాలి.*


*14. పిల్లలలో  కాని,  టీచర్ లలో  కాని  Covid  లక్షణాలు  ఉంటే  వారిని  స్కూల్  లోపలకి  అనుమతించ కూడదు.*


*15. పిల్లల ఇంటిలో  కుటుంబ  సభ్యుల లో  ఎవరికైనా  Covid  ఉంటే  వారిని  స్కూల్  లోపలికి  అనుమతించ కూడదు.*


*16. స్కూల్  లో  యాక్టివ్ గా  ఉంటూ  40 సంవత్సరాల  లోపు  వయస్సు  ఉన్న  ఒక  టీచర్స్ ను  Covid  Resource  Person  గా  నియమించాలి.*


*17. అతనికి  పిల్లలందరి  తల్లిదండ్రుల ఫోన్  నంబర్లు,  ఆ  ప్రాంతములోని  ANM ల ఫోన్ నంబర్లు  ఇవ్వాలి.*


*18. పిల్లలను,  టీచర్లను అతను  గమనిస్తూ  ఉండాలి. ఎవరైనా  నీరసంగా  గాని   ఉంటే  వారిని  Pulse  Oxy meter  తో  oxygen  లెవెల్  ను  చెక్  చేయాలి.*


Oxygen  level  90 *కంటే  (సాధారణంగా  94శాతం ఉండాలి  ) తక్కువగా  ఉంటే  ఆ పిల్లలను  isolation  రూమ్  లో  ఉంచి తల్లిదండ్రులను  పిలిచి  వారికీ  అప్పగించ వలయును.*


*19.  ప్రతి  స్కూల్ కి  గవర్నమెంట్  మరియు  ప్రైవేట్  స్కూల్స్ కి  కూడా  ఒక  Pulse  Oxymeter అందజేస్తామని  కలెక్టర్  గారు  తెలియచేసారు.*


*20. ప్రతి  టీచర్   Covid  కి  సంబందించిన  నియమాలను  పాటిస్తూ  పిల్లలు కూడా  పాటించేలా  చూడాలి.* 


*21. మొదటి  వారం  రోజులు  పిల్లలకు  Covid  నిబంధనలను  విస్తృతంగా  వివరిస్తే  తరువాత  వారు  అలవాటు  పడతారని  అలా  చేయాలనీ  తెలియచేసారు.*


*22. స్కూల్  Busses  లో  తక్కువ  మంది  పిల్లలు  ఉండేటట్లు  చూసుకోవాలి.* 


*23. బస్ లను  రోజు  శానిటేషన్  చేయించాలి.*


*24. హాస్టల్  ల  విషయం  గురించి  అడుగా  ఈవిషయం  చెప్పకుండా  దాటవేశారు.* 


*25. త్వరలో  రాష్ట్ర  ప్రభుత్వం  విధి  విధానాలను,  అకడమిక్  క్యాలెండరు  ప్రకటిస్తుందని,  దానిని  తప్పకుండా పాటించాలని  తెలియచేసినారు.*


*పైన  తెలిపిన నిబంధనలను  పాటిస్తూ పిల్లలు  మరియు  టీచర్స్  ఆరోగ్యానికి  తగిన  ప్రాధాన్యత  ఇస్తూ   అత్యంత  జాగర్తగా  పాఠశాలలను  నిర్వహించ వలసినదిగా  తెలియజేసారు.


మిగిలిన 9TH & 10TH CLASSES ALL SUBJECTS SYLLABUS



APPSC DEPARTMENTAL EXAMS E. TEST & G.O TEST STUDY MATERIAL, MODEL PAPERS

Top Post Ad

Below Post Ad