Type Here to Get Search Results !

JAGANANNA VIDYA KANUKA - JVK KIT ACQUITTANCE FORMS DOWNLOAD

 JAGANANNA VIDYA KANUKA - JVK KIT ACQUITTANCE FORMS DOWNLOAD

CLASS WISE JVK KIT MATERIAL DETAILS DOWNLOAD

 సమగ్ర శిక్షా 'జగనన్న విద్యా కాసుక 2021: విద్యార్థులకు కిట్లను క్షేత్ర స్థాయిలో రూపొందించుట, పంపిణీ కొరకు మార్గదర్శకాలు:

  • జగనన్న విద్యా కానుక వస్తువులు ప్రస్తుత సంవత్సరం (2021-22) మీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందజేయవలెను.
  • గత సంవత్సరం (2020-21) మీ పాఠశాలలో Primary -5, UP-7/8, High School -10 చదివిన విద్యార్థులకు JVK Kit ఇవ్వరాదు.
  • ఈ విద్యా సంవత్సరంలో 6 లేదా 8 లేదా 9వ తరగతిలో చేరే విద్యార్థులకు కొత్తగా చేరిన పాఠశాలలో మాత్రమే JVK Kit ఇవ్వవలెను.
  • TC  తీసుకుని వెళ్లే విద్యార్థులకు JVK Kit ఇవ్వకూడదు.
  •  గత సంవత్సరం చదివిన విద్యార్థుల JVK Kit ను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న UP / హైస్కూల్ నందు అందజేయవలెను.
  • ప్రతి బ్యాగుకు అన్ని అంశాలతో కూడిన చెక్ లిస్ట్ తయారు చేసి బ్యాగు పైన ఆతికించుకోవాలి.
యూనిఫాం:
  • యూనిఫాంకు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే 'Girls' అని, బాలురకు సంబంధించినవైతే 'Boys అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది. ఎవరిదైతే వారి 'దగ్గర 'టిక్' మార్క్ ముద్రించి ఉంటుంది. 
  • బేల్ లో యూనిఫాం ప్యాకెట్లు ఉంటాయి. ఒక్కొక్క బేల్లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో ముద్రించి ఉంటుంది. 
  • ఒక్కో బేల్లో ఒకే తరగతికి చెందిన యూనిఫాం క్లాత్ ప్యాకెట్ల రూపంలో వస్తుంది.
  • ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడే యూనిఫాం క్లాత్ ఉంటుంది.
  • ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు ప్యాకెట్లో రెండు క్లాత్ పీసులుఉంటాయి. 6-8 తరగతుల బాలికలకు 3 క్లాత్ పీసులు ఉంటాయి.
  • తరగతి వారీగా షర్టింగ్, సూటింగ్, చున్నీకి సంబంధించిన కొలతలు కూడా ముద్రించి ఉంటాయి.
  • యూనిఫాం బేల్లో ఒక్కో తరగతికి చెందిన క్లాత్ కొలతలు సరిగా సరిపోయాయా లేదా అనేది బేల్లో ఒక ప్యాకెట్ తీసుకుని చెక్ చేయాలి. (ఉదా: పై కొలతల్లో పేర్కొన్నట్లు ఒకటో తరగతి అబ్బాయి సూటింగ్ క్లాక్ 1.05 మీటర్లు, షర్టింగ్ క్లాత్ 1.47 మీటర్లు ఉండాలి. పై పేర్కొన్న కొలతల ప్రకారం ఉందా లేదా అనేది కొలవాలి. అలానే అన్ని తరగతులకు చెందిన బాలబాలికల క్లాత్ కొలతలు సరిగా ఉన్నాయా లేదా అనేది స్కేలు/ టేపుతో కొలిచి పరిశీలించాలి) రవాణా సమయంలో యూనిఫాం ఏవైనా చినిగినవా లేదా పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.
  • JVK KIT ACQUITTANCE FORM

     
  • ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో యూనిఫాం క్లాత్ యొక్క రంగు ఇచ్చిన నమూనాతో సరిపోలి ఉందా లేదా అని చూసుకోవాలి.
  • వాటిల్లో క్లాత్ నాణ్యత బాగాలేకపోయినా, రంగు మారినా, చినిగిపోయినా రిజక్ట్ చేసి వెనక్కి. పంపవచ్చు. 
  • రిజక్ట్ చేసిన సమాచారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారి/ సీఎంవో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి సమాచారం ఇవ్వాలి. మరియు 'జగనన్న విద్యాకానుక' యాప్ నందు నమోదు చేయాలి. తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం [email protected] కు ఈమెయిల్ పంపాలి.
    స్కూల్ బ్యాగులు:
    • రెండు రంగు లలో ఉంటాయి.
    • స్కై బ్లు రంగు అమ్మాయి లకు
    • నావి బ్లు రంగు అబ్బాయిలకు
    • స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి
    • ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి.
    • Small: 5వ తరగతి వరకు
    • Medium: 6 నుండి  7 వ  తరగతి వరకు
    • Large: 8,9, 10 తరగతులు
    JVK KIT ACQUITTANCE FORM


     బెల్ట్:
    • 3 రకాలు ఉంటాయి
    • 6 నుండి  10 తరగతుల అమ్మాయి లకు  బెల్టులు ఉండవు
    • 6 నుండి  10 తరగతుల అబ్బాయి లకు రెండు వైపుల నవారు కలిగిన బెల్ట్  ఉంటుంది.
    • 1-5 తరగతుల అమ్మాయిలకు ప్లాస్టిక్ బకెల్ తో కూడిన శాటన్ క్లాత్ బెల్టు 80 సెం.మీ.
    • 1-5 తరగతులు బాలురు: 80 సెం.మీ. 
    • 6-8 తరగతులు బాలురు: 90 సెం.మీ.
    • 9-10 తరగతులు బాలురు: 100 సెం.మీ.
    బూట్లు:
    • ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి.
    JVK KIT ACQUITTANCE FORM


    నోట్ బుక్స్:
    • 1-5 తరగతి లకు లేవు.
    • 6-7 తరగతులకు: 200 పేజీల వైట్ లాంగ్ 3, 200 పేజీల రూల్ద్ లాంగ్ 4, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1,  మొత్తం  8
    • 8వ  తరగతి: 200 పేజీల వైట్ లాంగ్ 4, 200 పేజీల రూల్ద్ లాంగ్ 4, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1, 40 పేజీల గ్రాఫ్ బుక్ 1, మొత్తం  10 
    • 9 వ తరగతి: 200 పేజీల వైట్ లాంగ్ 5, 200 పేజీల రూల్ద్ లాంగ్ 5, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1, 40 పేజీల గ్రాఫ్ బుక్ 1, మొత్తం  12
    • 10 వ  తరగతి: 200 పేజీల వైట్ లాంగ్ 6, 200 పేజీల రూల్ద్ లాంగ్ 6, 200 పేజీల బ్రాడ్ రూల్ద్ 1, 40 పేజీల గ్రాఫ్ బుక్ 1, మొత్తం  14
    నిఘంటువు: ఇంగ్లీష్-ఇంగ్లీష్-తెలుగు

    వీటన్నిటిని  టెక్స్ట్ పుస్తకం ల తో కలిపి  కిట్  ను  తయారు చేయాలి. అన్నింటి నీ  బ్యాగ్ లో సర్ది  చెక్ లిస్ట్  తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి.
     

    Top Post Ad

    Below Post Ad