Type Here to Get Search Results !

Recruitment for the various Anganwadi 484 posts in 20 ICDS project-CHITTOOR DT

 Recruitment for the various Anganwadi 484 posts in 20 ICDS project-CHITTOOR DT

చిత్తూరు జిల్లా - జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడీ ఉద్యోగాల నియమకాలు- 2021 - ప్రకటన

నోటిఫికేషన్ నెంబర్:4/ఏ3/2021 తేదీ:24.08.2021 జిల్లా లోని 20 ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడీ ఉద్యోగాల నియామక ప్రకటన 2021

దరఖాస్తు:

1. అంగన్వాడీల నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోఫోర్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజులలోగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయంలో లేదా

https://chittoor.ap.gov.in/ నుండి పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

2. అంగన్వాడి కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులు కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును.

3. అభ్యర్థులు వివాహితులు అయిన స్థానికులు అయి ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామములో స్థానికులు అయి ఉండవలెను. 4. 01.07.2021 నాటికీ దరఖాస్తుచేయు అభ్యర్థుల వయస్సు 21 సం.లు. నుండి 35 సం.లు లోపల

వారు అయి యుండవలెను.

5. అంగన్వాడీ సహాయకురాలు ఎవరైనా అంగన్వాడీ కార్యకర్తకు దరఖాస్తు చేసుకోవాలంటే జి.ఓ.ఎం.ఎస్. నెం.102 తేది: 28.03.2011 మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారము గరిష్ట వయసు 45 సం.లు.

6. యస్.సి. మరియు యస్.టి. ప్రాంతములలో గల యస్.సి. మరియు యస్.టి. అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా

7. అంగన్వాడి కార్యకర్త / అంగన్వాడి సహాయకురాలు పోస్ట్ కొరకు యస్.సి. మరియు యస్.టి. బిటేషన్స్ నందు యస్.సి. మరియు యస్.టి. అభ్యర్తులు మాత్రమే అర్హులు.

గౌరవ వేతనం

8. అంగన్వాడీ కార్యకర్త. మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము గౌరవవేతనం చెల్లించబడును. ప్రస్తుతము జూలై 2019 నుండి అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.11500/ నెలకు, మినీ అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం: రూ.7000/- నెలకు మరియు అంగన్వాడీ హెల్పెర్ గౌరవ వేతనం: రూ.7000/- నెలకు జి.ఓ. ఏం.ఎస్.నెం. 13 WCD&SC (PROGS) తేది: 26.06.2019 ప్రకారం చెల్లించబడును.

జతపరచవలసినవి

9. అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కులం (యస్.సి/యస్.టి/బి.సి. అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ తరగతి మార్క్స్ మెమో, ఆధార్, వికలాంగత్వముకు సంబంధించిన పత్రములను గెజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసినవి జతపరచవలయును.

10. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటి నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి./స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. స్క్రుటిని సమయములో సిడిపిఓ ఎటువంటి అవకతవకలుకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి.

11. కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారీచేయబడిన పత్రములను

ఏదేని గెజిటెడ్ అధికారి చే ధృవీకరణ చేసినవి జతపరచవలయును. 12. దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటో ను ముందు భాగములో అతికించి, ఫోటో ఏదేని గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేయవలయును.

13. దరఖాస్తులను స్వయముగా సమర్పించవచ్చు మరియు తపాలా ద్వారా కూడా సమర్పించవచ్చు

14. పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము మరియు మార్పు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.

రిజర్వేషన్

1. ఎ.పి. రాష్ట్ర మరియు సబార్డినేట్ సర్వీస్ యొక్క నియమం 22 ప్రకారం రిజర్వేషన్ల నియమం. అనుసరించబడుతుంది.

ఆ వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్ జి.ఓ. ఎం.ఎస్. నం.66, GA (Ser.D) 14.7.201 మరియు జి.ఓ. ఎం.ఎస్. నం. 73 GA (Ser.D) తేదీ: 04-08-2021 అనుసరించబడుతుంది.

3. BC-E కింది కి చెందిన అభ్యర్థుల తాత్కాలిక ఎంపిక గౌరవ న్యాయస్థానములు తుది తీర్పునకు మరియు ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండును.

నియామక పద్ధతి

ప్రభుత్వం జి.ఓ. నం. 18 మహిళలు, పిల్లలు (ప్రోగ్) వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ తేదీ: 15.05.2015 ప్రకారం, అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల నియామకాల కోసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీని అన్ని సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసిడిఎస్) ప్రాజెక్ట్ లో పునర్నియమించింది మరియు అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల ఎంపిక కోసం క్రింద వివరించిన విధంగా పారామీటర్లు/ప్రమాణాలు సవరించడం జరిగింది.

పునర్నియమించిన జిల్లా స్థాయి ఎంపిక కమిటీ

1) జిల్లా కలెక్టర్/చైర్ పర్సన్ జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్

2) సంబంధిత రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ సభ్యులు

3) జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్/అదనపు జిల్లా మెడికల్ & హెల్త్ ఆఫీసర్ సభ్యులు

4) సి.డి.పి.ఓ. సంబంధిత సభ్యులు

5) 5.పథక సంచాలకులు, జిల్లా స్త్రీ & శిశు అభివృద్ధి సంస్థ- సభ్యులు- కన్వీనర్

పారామీటరు/ప్రమాణాలు:

10వ తరగతి ఉత్తీర్ణులైతే - 50 MARKS

ప్రీ-స్కూల్ ట్రైనింగ్/ఇంటర్మీడియట్ బోర్డు ద్వార క్రైచి & ప్రీ స్కూల్ మనేజ్మెంట్ ట్రైనింగ్/ఇ.సి.ఇ వర్కర్ - 5MARKS

వితంతువు - 5MARKS

మైనర్ పిల్లలు కలిగిన వితంతువు - 5MARKS

అనాధ అయిన అభ్యర్థి., ఏదేని ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలలో/బాల సదన్ చదివి ఉంటే విభిన్న సామర్థ్యం ఉన్న అభ్యర్థులు - 5MARKS

ఓరల్ ఇంటర్వూ - 20MARKS

TOTAL - 100MARKS

Recruitment for the various Anganwadi posts Recruitment for the various Anganwadi postsRecruitment for the various Anganwadi posts Recruitment for the various Anganwadi postsRecruitment for the various Anganwadi posts Recruitment for the various Anganwadi postsRecruitment for the various Anganwadi posts Recruitment for the various Anganwadi posts

DOWNLOAD COMPLETE NOTIFICATION DETAILS AND APPLICATION FORM

Tags

Top Post Ad

Below Post Ad