Type Here to Get Search Results !

ELSS Funds – Invest in Tax Saving Mutual Funds

 ELSS: పన్ను ఆదాచేసే పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ మంచి ఎంపిక.. దీని గురించి తెలుసుకోండి! 

మీరు పన్ను ఆదా చేయగలిగే పెట్టుబడిని ప్లాన్ చేస్తుంటే, మీరు ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ELSS) లో పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను ఆదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం పన్ను ఆదా చేయడానికి, మెరుగైన రాబడిని పొందడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఈఎల్ఎస్ఎస్ లాకిన్ పీరియడ్ 3 ఏళ్లు

ఈఎల్ఎస్ఎస్ స్కీ్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే.. కచ్చితంగా మూడేళ్లు ఆగాల్సిందే. ఈఎల్‌ఎస్ఎస్ స్కీమ్స్ మెచ్యూరిటీ కాలం మూడేళ్లు. ఈలోపు పెట్టిన డబ్బులు మళ్లీ వెనక్కి తీసుకోవడం కుదరదు.  

ELSS

 

 రూ.1.5 లక్షల వరకు లిమిట్

ELSS (ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీం).. ఇది పన్ను ఆదా ప్రయోజన పథకం. మంచి రాబడిని ఇచ్చే పథకాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి పన్ను ELSS స్కీముల్లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయంగా చెప్పవచ్చు. ఏప్రిల్ నుంచి ప్రారంభించి మార్చి వరకు క్రమంగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏడాది చివర్లో ఇన్‌కం ట్యాక్స్ రిటర్స్ విషయంలో ఆందోళన తగ్గే అవకాశాలు ఉంటాయి. ELSSలో మంచి ఫండ్స్‌ను ఎంచుకోవాలి.

లాభాలు ఏమిటి?

కనీసం రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. మంత్లీ ఇన్వెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ తదితర వాటి కంటే ఎక్కువ ఇంటరెస్ట్ రేటు వస్తుంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో ELSS కూడా ఒకటి. ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల మొత్తం పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంటుంది. మార్కెట్ క్యాప్‌తో సంబంధం లేకుండా మంచి రాబడులకు అవకాశమున్న కంపెనీలను ఎంచుకొని ఇన్వెస్ట్ చేసే సౌలభ్యం ఈ ఫండ్స్ మేనేజర్లకు ఉంటుంది. డివిడెంట్ ఆప్షన్ ఎంచుకుంటే వచ్చే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. మూడేళ్ల లాకిన్ పీరియడ్ తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకునే సమయంలో వచ్చే లాభంలో రూ.1లక్ష వరకు పన్ను ఉండదు. అంతకుమించినా కేవలం 10 శాతం పన్ను ఉంటుంది. ప్రతి నెల రూ.12,500 మొత్తాన్ని సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరంలో రూ.1.5 లక్షలు అవుతుంది.

ఎన్నో ఈల్ఎస్ఎస్ స్కీంలు ఆదాయపన్ను ఆదా కోసం మాత్రం ఉత్తమమైన పెట్టుబడుల్లో ELSS ముఖ్యమైనది. ELSS స్కీంలో పెట్టుబడి తర్వాత లాకిన్ పీరియడ్ కంటే ముందు దానిని విత్ డ్రా చేసుకోలేరు. అలాగే, వాటిని మార్చుకోలేరు. ఇది ఓ రకమైన మ్యుచువల్ ఫండ్. లాకిన్ పీరియడ్ తర్వాత విత్ డ్రా చేసుకోవడం మాత్రమే భిన్నంగా ఉంటుంది. ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ ట్యాక్స్ సేవర్, కొటక్ ట్యాక్స్ సేవర్, రిలయన్స్ ట్యాక్స్ సేవర్.. వంటివి ఉన్నాయి. పెట్టుబడికి కారణాలు పెట్టుబడికి కారణాలు ఆదాయపన్ను ఆదా కోసం పలు రకాల పెట్టుబడులు ఉన్నాయి. కానీ ఆర్థిక నిపుణులు ELSS ది బెస్ట్ అని భావిస్తారు. అందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పీపీఎప్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీం వంటి ప్రభుత్వ స్కీంలు కూడా ఉన్నాయి. ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పథకాల్లో లాకిన్ పీరియడ్ తక్కువగా (మూడేళ్లు) ఉండేది ELSS, ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు... ఇలా పలు కారణాలు ఉన్నాయి.

సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు

మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడులపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అంటే, మీరు 1 ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు పన్ను తీసుకోవచ్చు. ఇది కాకుండా, ELSS లో పెట్టుబడిపై లాభం.. విమోచనం (పెట్టుబడి యూనిట్ అమ్మకం) నుండి పొందిన మొత్తం కూడా పూర్తిగా పన్ను రహితం.

మీరు దీనిలో రూ.500 తో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఈఎల్ఎస్ఎస్ లో ఇన్వెస్ట్‌మెంట్ కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా రూ .500 తో ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఈ ఫండ్లలో పెట్టుబడిదారులు రెండు రకాల ఎంపికలను పొందుతారు. మొదటిది పెరుగుదల. రెండవది డివిడెండ్ చెల్లింపు. వృద్ధి ఎంపికలో, డబ్బు నిరంతరం పథకంలో ఉంటుంది. దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ (LTCG) మ్యూచువల్ ఫండ్స్ నుండి సంవత్సరానికి అందుకున్న లక్ష రూపాయల వరకూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితికి మించిన లాభాలకు 10%చొప్పున పన్ను విదిస్తారు.

మెరుగైన రాబడి పొందడానికి ఈఎల్ఎస్ఎస్ ఒక మంచి ఎంపిక అని నిపుణులు చెబుతారు. గత ఒక్క సంవత్సరంలో ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు లేదా ఈఎల్ఎస్ఎస్ 70% కంటే ఎక్కువ రిటర్న్ ఇచ్చాయని నిపుణులు చెప్పారు. ఇది కాకుండా, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను సెక్షన్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకే మంచి రాబడులు పొందడానికి మరియు పన్ను ఆదా చేయడానికి ఇది గొప్ప ఎంపిక.

What is an ELSS fund?

An equity-linked savings scheme or an ELSS fund is the only kind of mutual funds eligible for tax deductions under the provisions of Section 80C of the Income Tax Act, 1961. You can claim a tax rebate of up to Rs 1,50,000 and save up to Rs 46,800 a year in taxes by investing in ELSS mutual funds.

ELSS mutual funds’ asset allocation is mostly (65% of the portfolio) made towards equity and equity-linked securities such as listed shares. They may have some exposure to fixed-income securities as well. These funds come with a lock-in period of just three years, the shortest among all Section 80C investments. 

What are the features of ELSS funds?

The following are the main features of ELSS mutual funds:

  • They offer tax deductions of up to Rs 1,50,000 a year under Section 80C provision
  • ELSS funds come with a lock-in period of three years, and there are no provisions to make a premature exit
  • You can invest any amount in ELSS, there is no upper capping, while the minimum investable amount varies across fund houses
  • ELSS funds are the only tax-saving investment with the potential to offer inflation-beating returns
  • Investing in ELSS funds gives you the twin benefits of tax deductions and wealth creation
  • The portfolio of an ELSS fund mostly consists of equities, while they have some exposure towards fixed-income securities as well

What are the tax benefits offered by ELSS funds

ELSS mutual funds provide tax deductions of up to Rs 1,50,000 a year under the provisions of Section 80C of the Income Tax Act, 1961. This helps you save up to Rs 46,800 a year in taxes. However, note that your investments are locked-in for three years from the date of investment.

Top Post Ad

Below Post Ad