Claim-inclusion-name-electoral-roll-Graduates’-Constituency
FORM 18 నమూనా 18 & FORM-6
Claim for inclusion of name in the electoral roll for a graduates’ constituency.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోండిలా..!*_
*ప్రభుత్వం కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు ప్రారంభించింది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఓట్ల నమోదుకు తగిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. నిబంధనల మేరకు ఓటర్లు తమ ఓటు నమోదు చేసుకోవాలంటే ఈ కింది పద్ధతులను పాటించాలి. గతంలో ఓటర్లుగా నమోదైన వారు కూడా తిరిగి తమ ఓట్లను నమోదు చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు ఫారం -18తో పాటు తమ ఒరిజనల్ డిగ్రీ లేక ప్రొవిజినల్ నకలును అంద జేయాలి.*
1-10-2015 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. 1-11-2018 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తై, మూడేళ్ళు నిండినవారే దరఖాస్తు చేసుకోవాలి.
ఓటర్లు తమ ఫొటోతో పాటు నివాస ధ్రువపత్రం అందజేయాలి.
దరఖాస్తు చేసుకునేటప్పుడు ఓటరు తాను నివాసం ఉండే ఇంట్లో మూడేళ్లుగా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం అందజేయాలి.
ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, గ్యాస్ కనెక్షన్, టెలిఫోన్ బిల్లుల్లో దేనినైనా సమర్పించవచ్చు.
ఉపాధ్యాయులయితే డీడీవో ద్వారా అటాచ్ చేసిన ఫారం-18 లను తహసీల్దార్‌కు సమర్పించాలి.
*♦ఆన్‌లైన్ ద్వారా అవకాశం.*
ఓటర్లు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో కూడా పంపించవచ్చు. ఓటు నమోదుకు పెట్టిన ధ్రువీకరణ పత్రాలను సబ్‌మిట్ చేయాలి.
అధికారి పరిశీలనకు వచ్చినప్పుడు ఓటర్లు ధ్రువీకరణ పత్రాలను చూపించాలి.
ఓటర్లు నవంబర్ ఆరో తేదీ వరకు తమ దరఖాస్తులను ఇవ్వొచ్చు. గతంలో ఓట్లన్నీ రద్దైనందున అర్హులందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
ఉపాధ్యాయులు, ఉద్యో గులు, పెన్షనర్లు, సీనియర్ సిటీజన్స్, గ్రాడ్యుయేట్లు కొత్తగా ఓట్లు నమోదు చేసుకోవచ్చు.*
SEARCH YOUR VOTER CARD (EPIC CARD NUMBER) CLICK HERE
OFFLINE APPLICATION FOR GRADUATE ELECTIONS CLICK HERE
ONLINE APPLICATION FOR GRADUATE ELECTIONS CLICK HERE
ENROLL YOUR ASSEMBLY VOTE (FORM-6) CLICK HERE