Type Here to Get Search Results !

Promotion Fixation Software For AP Teachers - Promotion Fixation Software Download

 Promotion Fixation Software For AP Teachers  -  Promotion Fixation Software Download

Promotion Fixation Software For AP Teachers  -  Promotion Fixation Software Download


 Promotion Fixation Software For AP Teachers  -  Promotion Fixation Software Download

The above software is prepared to andra pradesh and telangana in new PRC 2015 .this software can be use  for four types

1.Pay fixation arrears  from promotion date under FR 22 A1 (option given to increment date)
2.Re-Pay fixation arrears  from normal  increment  date under FR22 B (option given to increment date)
3.Pay fixtion arrears  from promotion date (Direct FR 22B)/(option given to promotion  date)
4.inial pay fixation arrears  from promotion date


               25.12.1982 తదుపరి అదనపు బాధ్యతలు గల పోస్టు నందు నియమించబడిన వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. 1992, 1998 పిఆర్సీ స్కేళ్ళలో 8సంవత్సరాల స్కేలు పొందకుండానే ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం, 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22ఎ(1)ప్రకారం వేతన స్థిరీకరణ చేయబడేది.

జివో ఎంఎస్ నెం. 145, ఆర్థిక తేదీ: 19.05.2009 ప్రకారం ఉద్యోగికి లాభదాయకంగా ఉండే విధానంలో  పైరెండింటిలో దేనిప్రకారం అయిన ఉద్యోగి ఆప్షన్ తో పనిలేకుండానే వేతన నిర్ణయం చేసేబాధ్యత డ్రాయింగ్ అధికారికి కల్పించబడింది.

       2005 
పిఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా ఇవ్వబడిన ఆటోమాటిక్ అడ్వాన్మెంట్ స్కీమ్ జివో 241 ఆర్థిక తేదీ: 28-09-2005 ద్వారా 8/16 స్కేళ్ళు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి కూడా ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకణలో రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. 2010, 2015 వేతన స్కేళ్లలో ఆర్డినరీ 6/12/18 స్కేళ్లు పొందుతూ ప్రమోషన్ వచ్చిన వారికి ఎఫ్ ఆర్ 22బి ప్రకారం వేతన స్థిరీకరణ జరుగుతుంది.

 Promotion Fixation Software For AP Teachers  -  Promotion Fixation Software Download


    
దీని ప్రకారం క్రింది పోస్టులో వేతనమునకు ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలిపి సదరు వేతనం ఆధారంగా పై పోస్టు యొక్క స్కేలులోని తదుపరి స్థిరీకరణ వేతన స్థిరీకరణ చేయబడుతుంది.
    
ఈ నిబంధన ప్రకారం వేతన స్థిరీకరణ రెండు విధాలుగా చేయవచ్చు.

1. 'వాస్తవ ప్రమోషన్తేదీ నాడు గానీ లేదా

2. 
క్రిందిపోస్టులోని తదుపరి 'ఇంక్రిమెంట్'  తేదీ నాడు గానీ వేతన స్థిరీకరణ చేయవచ్చును.

ఉదాహరణ: తేదీ 02.07.2010  first Appoinment గల Mallesham    అనే S.G. T ఉపాధ్యాయుడు తేదీ: 03.11.2019న స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందినాడు. సదరు తేదీనాటికి అతని వేతనం రూ.30580/- , స్కేలు రూ.22460-66330 లు గా ఉన్నది. వీరి వేతనం ఎఫ్ ఆర్ 22బి ప్రకారం రెండు విధాలుగా స్థిరీకరించవచ్చు.

 Promotion Fixation Software For AP Teachers  -  Promotion Fixation Software Download


I.    ప్రమోషన్ తేదీనాడు వేతన స్థిరీకరణకు option ఇచ్చినా సందర్భంలో: 
1. తేదీ: 03-11-2019 నాటికి ఎస్జిటి పోస్టులో మూల వేతనం మరియు స్కేలు:రూ, 30580/-స్కేలు 22460-66330

2. 
తేది : 03-11-2019 నాడు ఎఫ్ ఆర్ 22బి ప్రకారం SGT పోస్ట్ నందు ఒక నోషనల్ ఇంక్రిమెంటు మంజూరు  :రూ, 31460/- ,స్కేలు 22460-66330

3. 
తేది : 03-11-2019 నాడు స్కూల్ అసిస్టెంట్ స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం  : రూ,32340/- స్కేలు 28940 - 78910

4. 
తదుపరి ఇంక్రిమెంట్ తేదీ: 03/11/2020 (or) 01/11/2020

 EMPLOYEE ఇంక్రిమెంట్ తేదీ  >>> ప్రమోషన్ తేదీ నెలకు మారుతుంది. (The date of next increment shall be after completion of one year of service only from the date the pay fixed under FR 22 B.)

 Promotion Fixation Software For AP Teachers  -  Promotion Fixation Software Download



II.    క్రింది పోస్టులోని ఇంక్రిమెంట్ తేదీనాడు వేతన స్థిరీకరణకు  option ఇచ్చినా సందర్భంలో:

(DATE OF FIRST APPOINTMENT: 02/07/2010   ,Date of Promotion :03/11/2019, Date of next AGI: 01.07.2020)
             a)    On the date of Promotion   ie.,  03/11/2019  నాడు వేతన స్థిరీకరణ :
1. 
పదోన్నతి  పొందిన తేదీ  03/11/2019(PROMOTION DATE)  నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 30580/-స్కేలు 22460-66330

2. 
తేదీ  03/11/2019  పదోన్నతి పొందిన రోజున  ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం  initial  గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910

------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
 
           b)    On the date next increment    ie.,  01/07/2020  నాడు వేతన స్థిరీకరణ :

1. పదోన్నతి  పొందిన తేదీ  03/11/2019(PROMOTION DATE)  నాటికి ఎస్జిటీ పోస్టులో మూల వేతనం మరియు స్కేలు: రూ, 30580/-స్కేలు 22460-66330

2. 
తేదీ  03/11/2019  పదోన్నతి పొందిన రోజున  ఎఫ్ ఆర్ 22(1) ప్రకారం  initial  గా వేతన నిర్ణయం: రూ, 31460 స్కేలు 28940-78910

3. 
తేదీ 01.07.2020 న ఎస్జిటి పోస్టులో సాదారణ వార్షిక ఇంక్రిమెంట్ మంజూరు: రూ, 31460 ,స్కేలు 22460-66330

4. 
తేదీ 01.07.2020 న ఎస్జిటి పోస్టులో  ఎఫ్ ఆర్ 22బి ప్రకారం ఒక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు :  రూ 32340, /- ,స్కేలు 22460-66330

5. 
స్కూల్ అసిస్టెంట్ పోస్టు స్కేలులో తదుపరి స్టేజిలో వేతన నిర్ణయం :  రూ,33220/-  ,స్కేలు 28940 - 78910

6. 
తదుపరి ఇంక్రిమెంట్ తేదీ:  01.07.2021 (అనగా S.G.T Post నందు ఉన్న ఇంక్రిమెంట్ తేది కొనసాగును )
👉 24 సంవత్సరాల స్కేలు పొందుతూ ప్రమోషన్ వచ్చినవారికి  ఈ నిబంధన వర్తించదు. వారికి  ఎఫ్ ఆర్22ఎ(1)నిబంధన వర్తిస్తుంది. దాని వలన  ఒక ఇంక్రిమెంట్   లభిస్తుంది.
(FR 22 B is not applicable for those employees who are promoted while drawing SPP II/SAPP II scales. Their pay has to be fixed in the promotion category vide FR 22 (a)(i) read with FR 31(2).)

Top Post Ad

Below Post Ad