Type Here to Get Search Results !

PARENT COMMITTEE PC ELECTIONS 2021 GUIDELINES - USEFULL FORMATS DOWNLOAD

 పాఠశాలల తల్లిదండ్రుల కమిటీ, ఛైర్మెన్ మరియు వైస్ ఛైర్మెన్, ఎన్నికల మార్గదర్శకాలు 2021

1. ప్రతి పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీని ఏర్పాటు చేయవలసి ఉంటుంది (ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలలను మినహాయించి)

2. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహించాలి..

3. ఎన్నికలు నిర్వహించే సమయంలో కనీసం 50% తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి. కోరమ్ను రూపొందించే సమయంను ప్రధానోపాధ్యాయుడు నిర్ణయించాలి.

4. చేతులు ఎత్తే పద్ధతి ద్వారా గాని లేదా నోటితో చెప్పే విధానంలో గాని ఎన్నికలు నిర్వహించాలి. కాని కొన్ని ఆసాధారణ సందర్భం తలెత్తినప్పుడు, రహాస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలి.

5. తల్లి దండ్రులు మరియు సంరక్షకులలో ఒకరు మాత్రమే ఓటు హక్కుకు అర్హులు అవుతారు.

6. వివిధ తరగతులలో పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఆయా తరగతులకు సంబంధించిన ఎన్నికల్లో పాల్గోనుటకు అర్హులు.

7. తరగతుల వారిగా ఎన్నిక కాబడిన సభ్యుల నుండి ప్రధానంగా తల్లి దండ్రుల నుండి చైర్మెన్ మరియు వైస్ ఛైర్మెన్ ఎన్నుకోవాలి. వీరిలో కనీసం ఒకరు S.C, S.T, B.C, మైనారిటీల నుండి మరియు కనీసం ఒకరు మహిళ ఉండే విధంగా చూసుకోవాలి.

8. లోకల్ బాడిలో ఉన్న సభ్యులు మరియు ప్రధానోపాధ్యాయుడు (లేదా) ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఓటింగ్లో పాల్గోనుటకు అర్హులు కారు.

9. ఆయా తరగతులకు సంబంధించి ఓటు హక్కు కలిగిన పేరెంట్/గార్డియన్లు కొత్తగా అవసరమైన పి.సి.సభ్యులను ఎన్నుకొంటారు. అదేవిధంగా ఖాళీ బడిన సభ్యుల స్థానంలో కూడా కొత్త వారిని ఎన్నుకోవచ్చు.

10. ఒకసారి ఎన్నికయిన పి.సి.ని ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో యం.ఇ.ఓ. మరియు ఇతర పాఠశాలలో D.E.O. గారి ఆదేశాల ప్రకారం రద్దు పరచబడిన లేదా ఇతర పాఠశాలలో కలుపబడే అంతవరకు కొనసాగుతాయి. ఏది ఏమైనప్పటికీ సభ్యులు మాత్రం వారి నియమానుసారం పదవీచితులు కాబడుతూ ఉంటారు. ఈ విధంగా ఏర్పడిన ఖాళీలు మరియు సాధారణ ఖాళీలను ఎప్పటికప్పుడు అమలు పరచు ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఎన్నిక కాబడుతుంటారు.

11. అమలు పరచు సంస్థ అనగా, రాష్ట్ర పథక నిర్దేశకుడు (S.P.D) సర్వ శిక్ష అభియాన్ మరియు కమీషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్

12. నైబర్హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్ అనగా సురక్షితంగా ప్రయోనించగల 1 కి.మీ. దూరం (పాఠశాల నుండి) లో గల ఆవాస ప్రాంతాలు ప్రాథమిక పాఠశాలలో) అదే విధంగా 3 కి.మీ. పరిధిలో గల ఆవాస ప్రాంతలను "నైబర్ హుడ్ ఏరియా ఆఫ్ స్కూల్స్" అంటారు.

13. చైల్డ్ బిలాంగ్స్ టు సోషియల్లీ డిసడ్వాంటేజ్ గ్రూపు అనగా, S.C, S.T, అనాధలు, వలసదారులు, వీధి పిల్లలు, ప్రత్యేక అవసరాలు కల పిల్లలు మరియు హెచ్.ఐ.వి. సోకిన పిల్లలు.

14. చైల్డ్ బిలాంగ్స్ టు వీకర్స్ సెక్షన్స్ అనగా BC.s, మైనారిటీస్, OCలు (తల్లిదండ్రులలో) ఎవరి ఆదాయం సంవత్సరంలో 60000/- మించకుండా ఉంటుందో వారు.

15. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి రాజకీయ జోక్యం ఉండరాదు. ఉన్నట్లయితే ఎన్నికలకు ఇబ్బందులు కలిగిస్తే వారు చట్టరిత్యా శిక్షార్హులు.

16. పరిశీలకులుగా తహశీల్దార్ / M.P.D.O. విలేజ్ సెక్రెటరీ లేదా V.R.O., V.R.Aలు ఎన్నికల కార్యక్రమంలో పాటు పంచుకోటారు.

17. ఓటు పొందే హక్కు మొదట తల్లికి తరువాత తండ్రికి ఆ తరువాత సంరక్షకులకు ప్రాధాన్యత క్రమం ఇవ్వబడుతుంది. అయితే వారిలో ఒకరు మాత్రమే ఓటింగ్ కు అర్హులు.

18. ఓటింగ్ లో పాల్గోనే సభ్యులు ఐడి ఫ్రూఫ్ గా క్రింది కనబరచిన వాటిలో ఏదైనా ఒకటి తప్పక తీసుకురావాలి.

1) ఈ ఓటింగ్ కోసం ఇష్యూచేయబడిన ఓటింగ్ గుర్తింపుకార్డు.

2) రేషన్ కార్డు

3) ఆధార్ కార్డు

4) వింగ్ లైసెన్స్

5) ఓటర్ కార్డ్

6) ఇతర ఏదైనా ఐడి కార్డు ప్రభుత్వం చే ఇవ్వబడి ఉండాలి.

19. డిసడ్వ్వాంటేజ్ మరియు వీకర్ సెక్షన్ సభ్యులు లేని పక్షంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సభ్యులను ఎన్నుకోవాలి.

కమిటీ నిర్మాణము

ఎన్నుకోబడిన సభ్యులు:

1. ముగ్గురు పేరెంట్/గార్డియన్ సభ్యులను ప్రతి తరగతి నుండి ఎన్నుకోవాలి. ఇందులో కనీసం ఒకరు డిసడ్వ్వాంటేజ్ గ్రూపు వారు మరి ఒకరు వీకర్ సెక్షన్కు సంబంధించిన వారు ఉండాలి. అదే విధంగా ముగ్గురిలో ఇద్దరు మహిళలు ఖచ్చింగా ఉండాలి, ఏదైనా తరగతిలో ఆరు కన్న తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లయితే పై తరగతికి లేదా దిగువ తరగతికి కలిపి మొత్తం 6 మంది సభ్యులను ఎన్నుకోవాలి.

2. ఎన్నిక కాబడిన సభ్యుల కాల పరిమితి 2 సం॥ లు లేదా ఆ సభ్యుల యొక్క పిల్లలు ఆ పాఠశాలలో ఉన్నంత వరకు ఇందులో ఏది ముందు అయితే అది. వారి కాలపరిమితిగా పరిగణించబడుతుంది.

3. ఖాళీ కాబడిన P.C. సభ్యుల స్థానంలో కొత్త సభ్యులను ఎంట్రీ తరగతి నుండి కొత్త సభ్యులను ఎన్నుకోవడం

ఎక్స్ ఆఫిషియో మెంబర్స్

1. ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు మెంబర్ కన్వీనర్

2. అదనపు ఉపాధ్యాయ సభ్యులుగా M.E.O.చే నామినేట్ చేయబడుతారు మరియు వీరు ప్రధానోపాధ్యాయుని జెండర్కు వ్యతిరేక జెండర్ నుండి ఎన్నుకోవాలి.

3. ఆ ప్రాంత కార్పోరేటర్ / కౌన్సిలర్ వార్డు సభ్యుల యందు ఒకరు 4. అంగన్ వాడి వర్కర్స్, నైబర్ హుడ్ ఏరియాలలో పని చేయువారు.

5. మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్

6. ఆ గ్రామంలో/వార్డులోని మహిళా సమైక్య ప్రెసిడెంట్

కోఆప్టెడ్ మెంబర్స్

1. కో అప్టైడ్ సభ్యులుగా విద్యావేతలు, పిలాంత్రపిస్ట్, N.G.O.లు, అల్యూమిని లేదా పాఠశాలకు చేయూతనందించే

వారి నుండి ఇద్దరు సభ్యులను ఎన్నుకోవచ్చు.

2. వీరి పదవీకాలం మొదటి మీటింగ్ నుండి 2 సం॥ల వరకు కొనసాగుతుంది.

లోకల్ ఆధారిటీ చైర్ పర్సన్స్

1. ఆయా ప్రాంతంలోని సర్పంచ్/మునిసిపల్ ఛైర్ పర్సన్/మేయర్లు ఆయా ప్రాంతాలలో జరిగే P.C. మీటింగ్లకు వారి విచక్షణ మేరకు హాజరు అవుతారు.

PARENT COMMITTEE PC ELECTIONS 2021 PLEDGE DOWNLOAD 

PARENT COMMITTEE PC ELECTIONS 2021 MINUTES DOWNLOAD

 PC ELECTIONS 2021 OBSERVER FORM DOWNLOAD

PARENT COMMITTEE PC ELECTIONS 2021 OBSERVATION SHEET DOWNLOAD 

PARENT COMMITTEE PC ELECTIONS 2021 ELECTED MEMBERS SHEET DOWNLOAD 

PARENT COMMITTEE PC ELECTIONS 2021 CHAIRMEN - VICE CHAIRMEN SHEET  DOWNLOAD 

PARENT COMMITTEE PC ELECTIONS 2021 PARENTS ATTENDANCE SHEET DOWNLOAD 

PARENT COMMITTEE PC ELECTIONS 2021 PARENT COMMITTEE DOWNLOAD 

PARENT COMMITTEE PC ELECTIONS 2021 PRIMARY GUIDELINES DOWNLOAD 

PC ఎన్నికల వర్తనా నియమావళి తెలుగులో Download

Guidelines PPT on PC Elections by SSA, Kapada DOWNLOAD

పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు - సమావేశాల నిర్వహణ - బాథ్యతలు - తరచూ స్ఫురించే ప్రశ్నలు - సమాధానాలు by SSA  DOWNLOAD

పాఠశాల యాజమాన్య కమిటీ చైర్ పర్సన్స్, సభ్యుల ఉర్దూ ప్రతిజ్ఙ DOWNLOAD

PARENT COMMITTEE PC ELECTIONS 2021 UP UPTO 7TH GUIDELINES DOWNLOAD

PARENT COMMITTEE PC ELECTIONS 2021 UP UPTO 8TH GUIDELINES DOWNLOAD

PARENT COMMITTEE PC ELECTIONS 2021 HIGH SCHOOL GUIDELINES DOWNLOAD

 PARENT COMMITTEE PC ELECTIONS 2021 ALL FORMATS IN SINGLE PDF FILE DOWNLOAD

Top Post Ad

Below Post Ad