NMMS 2021 ONLINE APPLICATION NOTIFICATION
2022వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు అర్హులు. పరీక్ష రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్థులకు రూ.50/-లు. దరఖాస్తులను ఆన్ లైను లో 27-12-2021 నుండి స్వీకరించబడును. ఆన్ లైను లో దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ 27-01-2022 మరియు పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 29-01-2022. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు మరియు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలియజేసారు.