Type Here to Get Search Results !

Anantapur District Anganwadi Workers Jobs Recruitment 2022 Notification

  Anantapuramu District Anganwadi Workers Jobs Recruitment 2022 Notification

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురము జిల్లా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన 

నోటిఫికేషన్ నెంబర్ 233226. తేది: 06.09.2022

అనంతపురము జిల్లాలోని 10 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామక ప్రకటన 2022

అనంతపురము జిల్లాలోని 10 ఐ.సి.డి.యస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న వివిధ అంగన్వాడి ఉద్యోగాల నియామకం కొరకు దిగువ అనుబందములో ఇవ్వబడిన నిర్ణీత ప్రోఫార్మాలో ప్రకటన వెలువడిన తేదీ నుండి 7 రోజులలోగా అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

  • అంగన్వాడీ కార్యకర్త, మినీ అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొను వారు 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండవలయును. అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను అంటే అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామం మజరా స్థానికులు అయి ఉండవలెను.
  • 01.07.2022 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.
  • * SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.
  • * అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు పోస్టుల కొరకు SC మరియు ST హాబిటేషన్స్ నందు ఉండు SC మరియు ST అభ్యర్థులు మాత్రమే అర్హులు.
  • అంగన్వాడీ కార్యకర్త. మినీ అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకుల పోస్టులలో నియామకమగు అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు మరియు G.O.MS.NO.13 WCD&SC (PROCS) తేది. 26/06/19 ప్రకారం గౌరవవేతనం చెల్లించబడును. నెలకు అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ.11500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ:7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును.. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా కేంద్రాల వారిగా ప్రాజెక్టు కార్యాలయముల యందు నోటీసు బోర్డు నందు ఉంచబడును.
  • అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు కుల (SC/ST/BC అయితే), నివాసము, పుట్టిన తేది, పదవ
  • తరగతి మార్క్స్ మేమో, ఆధార్, వికలాంగత్వముకు సంబంధిచిన పత్రములను గజిటెడ్ అధికారిచే ధృవీకరణ పత్రాలను జతపరచవలయును. అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి పాసై ఉంటే, తప్పనిసరిగా టి.సి/స్టడీ సర్టిఫికేట్ లు జతపరచాలి. 
  • స్క్రూటినీ సమయములో CDPO ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా వెరిఫై చేసుకోవాలి. CDPO లు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను. 
  • కులము, నివాస పత్రములు సంబంధిత తహసీల్దారు వారిచే జారిచేయబడిన పత్రములను ఏదేని గజిటెడ్ అధికారి చే దృవీకరణ చేసినవి జతపరచవలయును.. 
  • దరఖాస్తులో ఇటీవల తీసిన ఫోటోను ముందు భాగములో అతికించి. ఫోటో పైన ఇంకు పెన్నుతో అభ్యర్తి సంతకము చేయవలయును.

గమనిక:

1) ఖాళీల వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయంలో సంప్రదించవలెను. ఖాళీల విషయంలో మార్పులు, చేర్పులు ఉండవచ్చును. 

2) మరిన్ని వివరాల కొరకు సంబంధిత సిడిపివో కార్యాలయం లేదా అనతపురము జిల్లా అధికారిక వెబ్సైటు https://ananthapuramu.ap.gov.in నందు చూసుకోగలరు. 

3) పిల్లల భద్రత దృష్ట్యా, మినీ అంగన్వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ల నియమ నిబంధనలు పూర్తిగా మినహాయించబడినది. ఎందుకంటే అక్కడ ఒకే వ్యక్తి ఉంటారు కావున పిల్లలను చూసుకోవడం, వంట చేయడం మరియు వడ్డించడంతో పాటు గృహ సందర్శన చేయడం వంటి పనులు చేయాల్సిన అవసరం ఉంది. అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లకు సంబంధించి, 6వ (అంధత్వం మరియు తక్కువదృష్టి), 31వ (చెవిటి మరియు వినికిడి లోపం) మరియు 86వ (ఆటిజం, మేధో వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) రోస్టర్ పాయింట్ నందు రిజర్వేషన్లు మినహాయించబడ్డాయి. పిల్లల భద్రత మరియు శ్రేయస్సు దృష్ట్యా, ఈ రోస్టర్ కొరకు మైనర్ లోకోమోటార్ వైకల్యం కలిగి ఉండి గృహ సందర్శన చేయగల సామర్థ్యానికి అడ్డురాని వైకల్యం ఉన్న మహిళలకు అవకాశం ఇవ్వబడుతుంది.

  • మరియు అన్ని వివరములు జిల్లా వెబ్ సైట్ https://ananthapuramu.ap.gov.in ను సంప్రదించగలరు మరియు పూర్తి చేసిన దరఖాస్తును సంబంధిత సిడిపివో కార్యాలయము నందు సమర్పించవలెను. 
  • పోస్టుల ఖాళీల వివరములు ఈ దిగువన ఇవ్వబడినవి. ఏ సమయములో నైనా పూర్తిగా ప్రకటన రద్దు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారికి కలదు.

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి:

 

Anantapuramu District Anganwadi Workers Jobs Recruitment 2022 Notification v
 
Anantapuramu District Anganwadi Workers Jobs Recruitment 2022 Notification


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనంతపురము జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలు- ప్రకటన వెలువరించింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 120 పోస్టులు

పోస్టులు: అంగన్వాడి కార్యకర్త, మిని అంగన్వాడి కార్యకర్త మరియు అంగన్వాడి సహాయకులు.

అర్హతలు: 10 వ తరగతి ఉత్తీర్ణులు అయి, అభ్యర్థులు వివాహితులయి మరియు స్థానికంగా నివాసం ఉండవలెను.

వయసు: 01.07.2022 నాటికి దరఖాస్తు చేయు అభ్యర్థుల వయసు 21 సంవత్సరంల నుండి 35 సంవత్సరాల లోపల ఉండవలెను.  SC మరియు ST ప్రాంతంలో గల SC మరియు ST అభ్యర్థులు 21 సంవత్సరములు నిండిన వారు లేని యెడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా అర్హులు.

వేతనం: అంగన్వాడి కార్యకర్తకు గౌరవ వేతనం రూ.11500/- మిని అంగన్వాడీ కార్యకర్త గౌరవ వేతనం రూ:7000/- మరియు అంగన్వాడి సహాయకులు గౌరవ వేతనం రూ.7000/- చెల్లించబడును.

దరఖాస్తు విధానం: దరఖాస్తులను సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో పొంది, తిరిగి సంబంధిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు పొందవలయును.

ప్రకటన తేదీ: 07-09-2022

దరఖాస్తుకు చివరి తేదీ: ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 7 రోజుల్లోగా దరఖాస్తు చేయాలి. 13-09-2022

DOWNLOAD  Anantapur District Anganwadi Workers Jobs Recruitment 2022 COMPLETEW Notification 

DOWNLOAD ANGANWADI APPLICATION FORM IN PDF

Top Post Ad

Below Post Ad