AAS 30 Years SPP-II B Scale Clarifications - Automatic Advancement Scheme 30Years Scale
AAS 30 YEARS SCALE SOFTWARE DOWNLOAD
30 Years AAS Scale Clarifications in Telugu PRC 2022 30 Yrs SPP-IIB Automatic Advancement Scheme Scale
AP PRC 2021 జీ వో నెంబర్ 1 లో ఇప్పటి వరకు ఉన్న 6/12/18/24 స్కేల్ లకు అదనంగా 30 సంవత్సరాల స్కేల్ ను చేర్చడం జరగింది. దీనికి SPP-II B గా పేర్కొనడం జరగింది.
ఈ కొత్త సవరణ తరువాత ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్ ల స్వరూపం ఈ కింద విధంగా ఉంది
ఒక పోస్టులో
- 6 సం పూర్తి అయ్యాక ఇచ్చేదీ SG Scale (Special Grade Scale)
- 12 సం పూర్తి అయ్యాక ఇచ్చేదీ SPP I-A Scale (మొదటి ప్రమోషన్ స్కేలు)
- 18 సం పూర్తి అయ్యాక ఇచ్చేదీ SPP I-B Scale (మొదటి ప్రమోషన్ స్కేలులోనే ఒక అదనపు ఇంక్రిమెంట్)
- 24 సం పూర్తి అయ్యాక ఇచ్చేదీ SPP II-A (రెండో ప్రమోషన్ స్కేల్ - ఇప్పటి వరకు ఇది SPP-II గా ఉండేది. ఇప్పుడు దీనిని SPP II-A గా మార్చడం జరిగినది)
- 30 సం పూర్తి అయ్యాక ఇచ్చేదీ SPP II-B ( ఇది కొత్తగా ప్రవేశ పెట్టిన స్కేల్ - 24 సం స్కేల్ లోనే ఒక అదనపు ఇంక్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది
Complete AAS Scales Updated Table as per AP PRC 2021 New AAS
పూర్తి చేసిన సర్విస్ | మంజూరు చేసే స్కేల్ పేరు | బెనిఫిట్ / అదనపు సమాచారం |
---|---|---|
6 సం సర్విస్ | SG Scale (Special Grade Scale) |
SG (స్పెషల్ గ్రేడ్) స్కేల్ కు పే స్కేల్ మారుతుంది. రెగ్యులర్ ఇంక్రిమెంట్ కు ఒక అదనపు ఇంక్రిమెంట్ వస్తుంది |
12 సం సర్విస్ | SPP I-A Scale | మొదటి ప్రమోషన్ పే స్కేల్ వస్తుంది రెగ్యులర్ ఇంక్రిమెంట్ కు ఒక అదనపు ఇంక్రిమెంట్ వస్తుంది |
18 సం సర్విస్ | SPP I-B Scale | SPP I-A Scale లో ఉన్న పే స్కేల్ కొనసాగుతుంది SPP I-A Scale లోనే ఒక అదనపు ఇంక్రిమెంట్ వస్తుంది. ఈ సమాచారం ఏపి టీచర్స్ డాట్ ఇన్ వెబ్సైట్ లో కలదు |
24 సం సర్విస్ | SPP II-A Scale | SPP II-A రెండో ప్రమోషన్ స్కేల్ వస్తుంది ఒక అదనపు ఇంక్రిమెంట్ వస్తుంది |
30 సం సర్విస్ | SPP II- B Scale | 24 సం లో ఉన్న పే స్కేల్ కొనసాగుతుంది SPP II- B Scale లోనే ఒక అదనపు ఇంక్రిమెంట్ వస్తుంది |
30 Years AAS SPP-II B Scale Reference Orders Released so far
30
సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేలు పై ఇప్పటి వరకు కింది
ఉత్తర్వులలో వివరణ మరియు క్లారిఫికేషన్ లు ఇవ్వడం జరిగింది
- G.O.Ms.No. 1, Finance department dated 17.01.2022
- Lr. No: FIN02-18069/65/2022-H SEC-DTA, 02/09/2022
పైన పేర్కొన్న G.O.Ms.No. 1, Finance department dated 17.01.2022
- రూల్ 10 (ii) ప్రకారం ఇప్పటి వరకు ఉన్న 24 సం ల SPP II స్కేల్ ను SPP II-A Scale గా మార్చడం జరిగినది
- రూల్ 10 (iii ) ప్రకారం ఒక పోస్టులో 30 సం పూర్త చేసిన ఉద్యోగికి SPP II- B Scale 30 సం ల స్కేల్ ను కొత్తగా మంజూరు చేయడం జరగింది
పైన పేర్కొన్న Lr. No: FIN02-18069/65/2022-H SEC-DTA, 02/09/2022
- ఇచ్చిన వివరణ ప్రకారం, 01.07.2018 కన్నా ముందు 30 సం పూర్తి చేసిన ఉద్యోగికి 30 సం స్కేల్ మంజూరు కొరకు Cir.Memo.No.020091/125/PC.II/2011, Finance Dept, dated 17.08.2011 మరియు G.O. Ms. No. 1, Finance department dated 17.01.2022 లో ఇచ్చిన రూల్స్ ప్రకారం నాడుచుకోవాలని పేర్కొనడం జరిగినది
పదోన్నతి
లేక ఒకే క్యాడర్ లో కొనసాగుతున్న ఉద్యోగులకు 2022 పీఆర్సీలో కొత్తగా 30
సం౹౹ల స్కేల్ మంజూరు చేస్తు GO Ms No. 1 Finance (PC-TA) dept dt.
17.01.2022 ఉత్తర్వులు ఇచ్చారు. అయితేఈ 30 సం౹౹ల స్కేల్ అమలుపై అనేక
అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా డిటిఏ గారు Lr No. FIN02-18069/ 65/2022-H SEC-DTA dt.02.09.2022
లేఖ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో 2011 లో కొత్తగా మంజూరు చేసిన
18 సం౹౹ల స్కేల్ అమలుపై ఇచ్చిన Cir. 020091ని అనుసరించాలని సూచించారు.
2010 పీఆర్సీకి మునుపు 8/16/24 సం౹౹ల స్కేల్స్ అమలులో ఉండగా GO 96 తేదీ 20.05.2011 మేరకు 8/16/24కు బదులుగా 6/12/24 స్కేల్స్ గా మారుస్తు కొత్తగా 18 స్కేల్ మంజూరు చేయడం జరిగింది.
18 స్కేల్ అమలుపై ఆనాడు 11 అంశాలపై వివరణలు ఇస్తు Cir. Memo No.020091/ 125/PC.II/2011 Finance dept dt.17.08.2011 ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరణలు 30సం౹౹ల స్కేల్ అమలుకు అన్వయించుకోవాలి. అందులోని వివరణల మేరకు
30 సంవత్సరాల సర్వీసు SPP-II B ఇంక్రిమెంట్ పై వివరణ - సందేహాల నివృత్తి
- GO No.1 Dt.17/1/2022 అనుసరించి PRC-2022 అమలు లోకి వచ్చింది.
- Rule 10.6 GO 1 ప్రకారం ఈ 30 సం స్కేల్ 1.7.2018 నుండి అమలులోకి వర్తిస్తుంది.
- Rule 10.6 GO 1 ప్రకారం ఏఏఎస్ 30 సం ఫిక్సేషన్ వలన పెరిగిన జీతం నగదు రూపంలో 1.1.2022 నుండి చెల్లించబడుతుంది. AAS పై నగదు చెల్లింపులు మాత్రం 1/2022 నుండి మాత్రమే చెల్లించబడుతుందని రూల్ No. 10.6 లో సూచించారు.
- PRC ఉత్తర్వులు ప్రకారం మానేటరీ బెనిఫిట్ 1.4.2020 నుండి వస్తుంది. నగదు రూపంలో 1.1.2022 నుండి మాత్రమే వస్తుంది. అయితే AAS సెక్షన్ లో AAS కొరకు నగదు రూపంలో వచ్చే తేదీ 1.1.2022 నుండి అని ఇవ్వడం జరిగినది.
- 24/30 సం౹౹ల స్కేల్స్(SPP II) పొందిన తర్వాత పదోన్నతి పొందిన వారికి FR22(B) వర్తించదు. అనగా FR 22(a)(1) మేరకు ఒక్క ఇంక్రిమెంట్ మాత్రమే మంజూరు చేస్తారు.
- 24/30 సం౹౹ల స్కేల్ పొందిన తర్వాత పదోన్నతి పొందిన క్యాడర్ లో AAS వర్తించదు.
- 30 సం౹౹ల స్కేల్ వేతన స్థిరీకరణ 01.01.2022 నుండి మాత్రమే నగదుగా చెల్లిస్తారు.
Question-1 పి ఆర్ సి లో కొత్తగా ఇచ్చిన 30 సం|| స్కేలు కి కావలసిన అదనపు అర్హతలు ఏమిటి ?
జ)
30 సం || స్కేల్ కు ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. 24 సం స్కేలు పొందిన
వారు అదే పోస్టులో కొనసాగుతూ ఉంటే 30 సం సర్విస్ నిండిన పిదప అదే స్కేలు
లో ఒక ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది
Question -2 నేను 15.10.2019 నాటికి 30 సం సర్విస్ పూర్తి చేసుకున్నాను. నాకు 30 సం ఇంక్రిమెంట్ వర్తిస్తుందా ?
జ)
జీవో నం 1, తేదీ 17.1.2022 ప్రకారం 1.7.2018 నాటికి 30 సం సర్విస్ నిండి
అదే కేడర్ లో కొనసాగుతున్న వారికి 1.7.2018 నుండి అ తదుపరి నిండిన వారికి
ఆయా తేదీ నుండి 30 సం || ఇంక్రిమెంట్ ఇస్తారు. మీకు 15.10.2019 నుండి 30
స్కేలు ఇంక్రిమెంట్ ఇస్తారు. జీతంలో పెరుగుదల మాత్రం 1.1.2022 నుండి
ఇస్తారు.
(01.07.2018నాటి కన్నా ముందు ఒకే క్యాడర్ లో 30సం౹౹ల
సర్వీస్ పూర్తి చేసుకుని 01.07.2018 నాటికి అదే క్యాడర్ లో కొనసాగుతున్న ఆ
ఉద్యోగికి 1.7.2018 నుండి మాత్రమే 30సం౹౹ల స్కేల్ మంజూరు చేయవచ్చు.)
Question -3 నాకు
30.4.2018 నాటికి 30 సం || సర్వీసు పూర్తి అయింది. ప్రమోషన్ రాలేదు.
30.4.2020 న ఉద్యోగి విరమణ చేసినాను. నాకు ఎస్ పి పి - 2 బి ఇంక్రిమెంట్
వస్తుందా ?
జ) వస్తుంది. 1.7.2018 నాటికి 30
సం| సర్వీసు నిండి అదే కేడర్ లో పనిచేస్తున్న వారికి 1.7.2018 నుండి ఎస్ పి
పి - 2 బి ఇంక్రిమెంట్ వస్తుంది. ఆర్ధిక లాభం 1.4.2020 నుండి
వర్తిస్తుంది. నగదు రూపంలో 1.1.2022 నుండి చెల్లిస్తారు.
Question-4 నాకు అర్హతలు లేని కారణంగా 2015 లో ఇవ్వాల్సిన 24 సం స్కేల్ మంజూరు చేయలేదు. ఇప్పుడు 30 సం స్కేలు ఇస్తారా ?
జ) ఇవ్వరు. 24 సం ల స్కేలు మంజూరు కాని వారికి 30 సం స్కేలు ఇవ్వరు
Question-5 నాకు
1.3.2018 నాటికి 30 సం సర్విస్ పూర్తి అయ్యింది. తదుపరి 30.5.2018 న
ప్రమోషన్ వచ్చింది. నేను 30 సం స్కేలు వర్తింపచేసుకొని, ప్రమోషన్ రీ
ఫిక్సేషన్ చేసుకోవచ్చా ?
Question-6 నేను 1.10.2018 నాటికి 30 సం సర్విస్ పూర్తి చేసుకున్నాను. తదుపరి 1.1.2020 న ప్రమోషన్ పొందడం జరిగినది. నాకు 30 సం స్కేలు వర్తిస్తుందా ?
జ ) 01.07.2018 తర్వాత 30 సం౹౹ల సర్వీసు పూర్తయి తర్వాత పదోన్నతి పొందిన వారికి కూడా 30 సం౹౹ల స్కేల్ వర్తిస్తుంది. కాబట్టి మీకు 30 సం స్కేలు వర్తిస్తుంది
Question-7 నేను ఎస్జీటీ గా 2016 నాటికి 30 సం సర్విస్ పూర్తి చేసుకున్నాను. జులై 2019 లో స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందాను. నేను ఎస్జీటీ కేడర్ లో 30 సం స్కేలు పొందగలనా ?
జ ) మీరు 01.07.2018 నాటికే 30 సం సర్విస్ పూర్తి చేసుకున్నందున మరియు 1.7.2018 న మీరు అదే కేడర్ లో ఉన్నందున మీకు 1.7.2018 నుండి ఎస్ జి టి కేడర్ లో 30 సం ఇంక్రిమెంట్ ఇవ్వబడుతుంది