Type Here to Get Search Results !

FA3 EXAM Time Table - FA3 Exam Instructions

 FA3 EXAM Time Table - FA3 Exam Instructions 





School Education - SCERT- AP - Assessments - Formative Assessment 3/ CBA 2 - Timetable for the Academic year 2022-23 - communicated - Reg Rc.No.ESE02/591/2022-SCERT Dated: 31.01.2023

FA3 EXAM Time Table - FA3 Exam Instructions

 

FA3 EXAM Time Table - FA3 Exam Instructions

 

Ref:

1. Academic calendar 2022-23
2. Rc.No.ESE02/983/2021-SCERT Dated:01/04/2022
3. Rc. No: ESE02/591/2022-SCERT Date:23/11/2022
4. Rc. No: ESE02/30/2023-SCERT Date09/01/2023
5. Rc.No.ESE02/591/2022-SCERT Dated: 24.01.2023

 

The attention of all the Regional Joint Directors and District Educational Officers in the state is invited to the reference 3rd cited above, where in the orders were issued to conduct CBA2/ Formative Assessment-3 from 7th to 10th of February,2023. In this connection the detailed time table for CBA2/ Formative Assessment 3 is issued accordingly.

 

It is aware that, as per the instructions issued in references 4 and 5, DCEBs should print and supply the question papers to classes 1–5 for all types of government and aided management schools only. While in the case of classes 6–10, DCEBs should print and supply the question papers for all types of government, aided management, and private management schools as well.

 

Therefore, all the RJDSEs and DEOs are requested to ensure that the CBA2/ Formative Assessment 3 is to be completed within the time frame suggested and to make 100% of the student marks are entered into the School Education Portal within the time frame specified.

 

The detailed time table is annexed here with.

 

This has got the approval of the Commissioner of School Education, AP.

CBA2/FA3 Schedule for Primary classes (1 to 5).

 

CBA2/FA3 Schedule for Primary classes (1 to 5).

 

Date

Session 1

Session 2

07.02.2023

For classes 3 TO 5

OSSC 10.00 A.M to 11.00 A.M

 

08.02.2023

Telugu 10.00 A.M to 11.00 A.M (1st Language)

Mathematics 02.00 P.M to 3.00 P.M

09.02.2023

English

10.00 A.M to 11.00 A.M

Environmental
Science
02.00 P.M to 3.00
P.M

 

CBA2/FA3 Schedule for classes (6 to 8).

 

Date

6,7,8 Classes

07.02.2023

OSSC, OSSC-I, (01.30 P.M to 02.30 P.M) OSSC-II (03.00 P.M to 04.00 P.M)

08.02.2023

Telugu, (01.30 P.M to 02.30 P.M) (1st Language)

Mathematics(03.00 P.M to 04.00 P.M)

09.02.2023

Hindi, (01.30 P.M to 02.30 P.M)

(2nd Language)

General Science (03.00 P.M to 04.00 P.M)

10.02.2023

English (01.30 P.M to 02.30 P.M)

(3rd Language)

Social Studies (03.00 P.M to 04.00 P.M)

 

FA3 Schedule for Secondary Classes (9 to 10)

 

Date

9,10 Classes

07.02.2023

OSSC, OSSC-I, (09.30 A.M to 10.30 A.M) OSSC-II Noon (11.00 A.M to 12.00 Noon).

08.02.2023

Telugu, (09.30 A.M to 10.15 A.M) (1st Language)

Mathematics (11.00 A.M to 11.45 Noon

09.02.2023

Hindi, (09.30 A.M to 10.15 A.M)

(2nd Language)

General Science Noon (11.00 A.M to 11.45 Noon)

10.02.2023

English (09.30 A.M to 10.15 A.M)

(3rd Language)

Social  Studies Noon (11.00 A.M to 11.45 Noon)

 


నిర్మాణాత్మక మదింపు-3 పరీక్షల నిర్వహణకు సూచనలు

FA3 EXAM Time Table - FA3 Exam Instructions 


ఈ సూచనలను ప్రతి మండల విద్యాశాఖాధికారి, కాంప్లెక్స్ హెడ్మాస్టరు, CRP మరియు అందరూఉపాధ్యాయులు పూర్తిగా చదివి అర్ధం చేసుకొనిపరీక్ష నిర్వహించాలి.

Time table for Formative assessments-III (CBA-2) : 2022-23

 1. జిల్లా లోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో (1 నుండి 10 వ తరగతి వరకు) మరియు ప్రవేట్ యాజమాన్య పాఠశాలలలో (6 నుండి 10 వ తరగతి వరకు) SCERT-AP వారి ద్వారా జారీ చేయబడ్డ ప్రశ్నా పత్రాలతో మాత్రమే తేదీ 07.02.2023 నుండి FA-III పరీక్షలు నిర్వహించాలి. (Proc of the Director SCERT-AP,

vide RC.NO.ESE02/591/2022-SCERT Dated: 24.01.2023)

1 వ తరగతి నుండి 8 తరగతి వరకు గల విద్యార్థులకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ (CBA-2) నిర్వహించడం జరుగుతుంది. 9వ మరియు 10వ తరగతుల విద్యార్థులకు, గతంలో మాదిరిగానే FA-III పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.

3. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ కు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు ప్రశ్నా పత్రంతో పాటు Variable OMR షీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు కేవలం ప్రశ్నా పత్రములు మాత్రమే ఇవ్వబడతాయి. OMRలు ఇవ్వబడవు.

4. ప్రశ్నా పత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ తరహా ప్రశ్నలు కూడా ఇవ్వబడతాయి. విద్యార్థులు జవాబులను ప్రశ్నా పత్రం లోనే టిక్ చేయాలి, వ్రాయాలి మరియు OMR నందు బబుల్ చేయాలి.

మండల విద్యాశాఖాధికారి చేయవలసిన పనులు పరీక్షలకు ముందు చేయవలసిన పనులు


6. జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం నుండి ప్రశ్నాపత్రాలను Variable OMR లను, Buffer OMRలను, పాఠశాల వారి విద్యార్థుల సంఖ్యలను తెలుపు లిస్టులను తీసుకొని సరి చూసు కొనవలెను. ప్రశ్నా పత్రాలను మండల విద్యాశాఖాధికారి మరియు ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుని సమక్షములో స్ట్రాంగ్ రూమ్ లో కానీ తాళముల వేసిన బాక్స్ లలో గాని భద్రపరచి వారి కస్టడీలో ఉంచుకొనవలెను.

7. ఇవ్వబడిన లిస్టు ప్రకారం పాఠశాల వారీ Variable OMRలను విభజించి పాఠశాల వారీ బాక్సులలో ఉంచి, తరగతికి ఒకటి చొప్పున కవర్లు ఉంచి, పాఠశాలలకు 05.02.2023 తేదీ ఇవ్వవలెను. వారు పాఠశాలలోని అందరు విద్యార్థులకు Variable OMR లు సరి పోయినవి/లేదు అని సరిచూసుకొన్న తరువాత అవసరమైన Buffer OMR లను 06.02.2023 వ తేదీ ఇవ్వవలెను.

 8. అట్లే 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను కాంప్లెక్స్ వారీగా విభజించుకొని, 06.02.2023 వ తేదీ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు ఇచ్చి మరల వారు పరీక్ష రోజులలో వారి కాంప్లెక్స్ లోని పాఠశాలలకు రోజువారి ఇవ్వవలసినట్లుగా తెలియజేయవలెను.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

9. 6 నుండి 10వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను అన్ని పాఠశాలలకు MRC నుండి మాత్రమే ప్రతిరోజు టైం టేబుల్ అనుసరించి పరీక్షకు ఒక గంట ముందుగా ఇవ్వవలెను.

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

10. పరీక్షల అనంతరం, అనగా 10.02.2023 తేదీ అన్ని పాఠశాలల నుండి OMR షీట్స్ పాకెట్స్ సేకరించి, కన్సాలిడేటెడ్ లిస్టు తయారు చేసి స్కానింగ్ నిమిత్తమై 11.02.2023 తేదీ జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగము కార్యాలయానికి పాలి.

కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేయవలసిన పనులు


11. కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లు వారి కాంప్లెక్స్ కు సంబంధించిన అన్ని పాఠశాలల యొక్క తరగతి వారి విద్యార్థుల సంఖ్య లతో కూడిన లిస్టులను, 1 నుండి 5వ తరగతి వరకు ప్రశ్నాపత్రాలను MRC నుండి CRP ద్వారా 06.02.2023 వ తేదీ తెప్పించుకొని తమ కస్టడీలో ఉంచుకొనవలెను.

12. ప్రతి పరీక్ష రోజు పాఠశాలకు కేటాయించబడిన ప్రశ్నాపత్రాలను, పరీక్షకు గంట ముందు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు ఇవ్వవలెను.

పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సూచనలు

పరీక్షలకు ముందు చేయవలసిన పనులు


13. మొదటగా మీ పాఠశాలలోని విద్యార్థుల యొక్క తరగతి వారి లిస్టులను వారి child ID లతో తతయారుచేసుకున సిద్ధంగా ఉంచుకొనవలెను.

14. 05.02.2023 వ తేదీ MRC నుండి మీ పాఠశాలకు సంబంధించిన Variable OMRలను తీసుకొని సరి చూసు కొనవలెను. Variable OMRలు కేటాయించబడని విద్యార్ధుల కొరకు Buffer OMR లను MRC వద్దనుండి 06.02.2023 తేదీ తీసుకొని విద్యార్థుల పేరు, child ID లను రాసుకొని సిద్ధముగా ఉంచుకొనవలెను.

పరీక్షల సమయంలో చేయవలసిన పనులు

15. 6 నుండి పదవ తరగతి విద్యార్ధుల యొక్క ప్రశ్నాపత్రాలను ఏ రోజుకు ఆ రోజు MRC నుండి పరీక్షకు ఒక గగం ముందు తీసుకొని పాఠశాలకు రావలెను 

 16. పరీక్షకు ముందు విద్యార్థులను క్రమంగా సరైన దూరములో కూర్చుండబెట్టి వారి వారి OMR లను వారికి
అందజేయాలి, పేరు, child IDలు సరిపోయినవి /లేదు అని సరి చూసుకొనమని విద్యార్థులకు తెలియజేయాలి.

17. తరువాత ప్రశ్నాపత్రాలను అందజేయాలి. CBA పరీక్షా పత్రంలో రెండు రకముల ప్రశ్నలు ఉంటాయి
బహుళైచ్ఛిక ప్రశ్నలు - 2 నుండి 4 ఎంపికలు ఉంటాయి వాటిలో ఒకటి మాత్రమే సరైన సమాధానం. సరియైన ఎంపికను ప్రశ్నాపత్రం పై గుర్తించాలి మరియు OMRపై సరి అయిన వృత్తములో బబుల్ చేయాలి. ఎంపిక లేని ప్రశ్నలు - ఈ ప్రశ్నలకు జవాబులను ప్రశ్నాపత్రం పైనే రాయాలి ( OMR లపై గుర్తించవలసిన అవసరం లేదు)

18. విద్యార్థులు OMR లపై బహుళైచ్ఛిక ప్రశ్నలకు మాత్రమే జవాబులు గుర్తించాలని, ఎంపిక లేని ప్రశ్నలకు జవాబులను OMR పై రాయవలసిన అవసరం లేదని విద్యార్థులకు తెలియజేయాలి.

19. అన్ని తరగతుల వారికి ఏ సబ్జెక్ట్ పేపర్ కు అయినా పరీక్షా సమయం ఒక్క గంట మాత్రమే అనుమతించాలి.

20. ఒకే OMR పై అన్ని సబ్జెక్టులకు సంబంధించిన బబుల్ ఉంటాయి కాబట్టి ఏ పరీక్షకు ఆసబ్జెక్టుకు సంబంధించిన
బబుల్స్ మాత్రమే విద్యార్ధి నింపాలని తెలియజేయాలి, పర్యవేక్షించాలి

21. ప్రతిరోజూ పరీక్ష పూర్తైన వెంటనే విద్యార్థుల నుండి ప్రశ్నా పత్రంతో పాటు OMR షీట్ కూడా వెనుకకు తీసుకోవాలి. 

22. ప్రతి విద్యార్థి యొక్క OMR నుపరిశీలించి, విద్యార్థి ఏదైనా ప్రశ్నకు ఎంపికను గుర్తించనిచో ఆ ప్రశ్నకు ఉపాధ్యాయుడు Eఅనే ఎంపికను bubble చేయాలి.

23. ఒక్కొక్క విద్యార్థికి అన్ని పరీక్షలకు కలిపి ఒకే OMR షీట్ ఇవ్వబడుతుంది. కనుక ప్రతిరోజు అదే OMR ను ఇచ్చి ఆ సబ్జెక్టు నందు జవాబులను బబుల్ చేయించవలెను

24. 1, 2, 3 తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు:

 ఉపాధ్యాయుడు ప్రతి ప్రశ్నను గట్టిగా చదివి విద్యార్థులు ఆ ప్రశ్నకు జవాబును గుర్తించిన తర్వాతమరియొక ప్రశ్న ను గట్టిగా చదువుతూ విద్యార్థుల చే జవాబులను రాయించాలి. పరీక్ష అనంతరం విద్యార్థుల నుండి ప్రశ్నాపత్రం లను సేకరించి వారిOMR లపై ఉపాధ్యాయుడే విద్యార్థి యొక్క జవాబులను బబుల్ చేయాలి.

25. తరగతుల పరీక్ష నిర్వహణలో సూచనలు: OMR లపై విద్యార్థులే జవాబులను గుర్తించాలి. తెలుగు ఇంగ్లీషు పరీక్షలలో ప్యాసేజ్లను ఉపాధ్యాయుడు గట్టిగా చదివి వినిపించిన తరువాత విద్యార్థులు జవాబులను రాయాలని తెలియజేయాలి.

పరీక్షల అనంతరం చేయవలసిన పనులు

26. పరీక్షలు అన్ని పూర్తైన వెంటనే OMR షీట్స్ అన్నింటిని, తరగతి వారీగా వేరు వేరుపాలిథిన్ కవర్స్ నందు ఉంచి, అన్నింటిని కార్డు బోర్డు బాక్స్ నందుప్యాక్ చేసి, మండల విద్యాశాఖాధికారి వారి కార్యాలయానికి ఐదవ తేదీపంపాలి.

27. OMR షీట్స్ ను జిల్లా స్థాయిలో స్కాన్ చేయించడం జరుగుతుంది. OMR నందు విద్యార్థులు పొందిన మార్కుల వివరాలు పాఠశాలలకు తెలియజేయబడవు. అవి కేవలం విద్యార్థుల స్థాయిని అంచనావేసి భవిష్యత్తులో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇవ్వవలసిన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనకు మాత్రమే వినియోగించడం జరుగుతుంది.

28. CBA పరీక్షల అనంతరం ప్రతి తరగతి (1 నుండి 8 తరగతులకు మాత్రమే), ప్రతి సబ్జెక్టు నకు KEY విడుదల చేయబడుతుంది దాని ప్రకారం ఉపాధ్యాయులు విద్యార్థుల వద్ద నుండి ప్రతి రోజు పరీక్ష తదనంతరం వెనుకకు సేకరించిన జవాబులతో కూడిన ప్రశ్నా పత్రములలోని జవాబులను దిద్దాలి. విద్యార్థులు పొందిన మార్కులను సంబంధిత రిజిస్టర్లు నందు నమోదు చేయడంతో పాటు, నిర్ణీత సమయం లోపల CSE సైట్ నందు ఎంటర్ చేయాలి. జవాబులతో కూడిన ప్రశ్నా పత్రాలను తనిఖీ అధికారుల పరిశీలనార్ధం భద్రపరచాలి.

29. విద్యార్థులు పొందిన మార్కులను ప్రోగ్రెస్ కార్డులందు నమోదుచేసి విద్యార్థుల తల్లిదండ్రులకు పంపాలి. తక్కువ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమీక్షా సమావేశంలో FA-III నందు విద్యార్థులు చూపిన ప్రతిభపై చర్చించాలి.

 DOWNLOAD CBA2 EXAM Conducting Instructions

DOWNLOAD FA3 EXAM TIME TABLE

Download FA3 EXAM INSTRUCTIONS

Top Post Ad

Below Post Ad