APTWREI SOCIETY (GURUKULAM) - Ekalavya Model Residential Schools (EMRS) - 6th Class Admission Notification
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం :: గిరిజన సంక్షేమ శాఖ
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, తాడేపల్లి, గుంటూరు జిల్లా)
ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 2023-2024 విద్యా సంవత్సరంలో ప్రవేశ దరఖాస్తు చేసుకొనే విద్యార్ధులకు ప్రాథమిక సమాచారం.
Rc.No APTWRE-13021/4/2023, Dated:23/02/2023
1. 2023-2024 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం నడుపబడుతున్న (28) ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో గల 60 సీట్లను మరియు 7వ, 8వ, 9వ తరగతులలో గల మిగిలిన ఖాళీలను నింపడానికి అర్హులైన విద్యార్ధిని మరియు ఆధ్వర్యంలో విద్యార్ధుల నుండి ఆన్లైన్ ద్వార దరఖాస్తులు కోరబడుతున్నవి.
2.ఈ సీట్లు అన్ని వ్రాత పరీక్ష నందు పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం ప్రవేశములు కల్పించడం జరుగుతుంది.
3. 6వ తరగతిలో గల 60 సీట్లను 30 బాలురకు, 30 బాలికలకు ఈ క్రింది ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో గలవు.
6. 6వ తరగతిలో ప్రవేశం కోరుకొనే బాల బాలికలు 2022-23 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూలులో చదివి ఉండాలి లేదా విద్యా హక్కు చట్టం 2009 నందు సెక్షన్ 4 ప్రకారం విద్యార్ధి ఇంటివద్దనే 5వ తరగతి చదివిన వారు కూడా అర్హులు. ఐతే విద్యార్ధి యొక్క తల్లిదండ్రులు / సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది.
7. ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో విద్యా బోధనా అంతా ఇంగ్లీష్ మీడియంలో మరియు సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఉంటుంది.
8. తెలుగు మీడియం లో చదివిన విద్యార్థులు కూడా వ్రాత పరీక్షకు అర్హులు.
9. రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులందరికీ నిర్దిష్ట రిజర్వేషన్ లేకుండా మెరిట్ ప్రకారం సీట్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్ధికి సంబంధించిన జిల్లాలో ఈ ఏకలవ్య గురుకుల విద్యాలయం లేకపోయినా సమీపంలో గల ఏకలవ్య గురుకుల విద్యాలయంలో చదవడానికి దరఖాస్తు చేసుకోవచ్చును. ఆయనపటికి ప్రతి ఏకలవ్య గురుకుల విద్యాలయం నందు గల సీట్లలో 30 శాతం సీట్లు మెరిట్ ఆధారంగా స్థానిక జిల్లా, తాలుకా, మండలం వారికి మెరిట్ ఆధారంగా ఇవ్వబడతాయి.
10. 6వ తరగతిలో గల మొత్తం 60 సీట్లలో (i) (48) సీట్లు గిరిజన బాల బాలికలకు, (ii) (3) సీట్లు ఆదివాసీ గిరిజనులకు, (ii) (3) సీట్లు డి. నోటిఫైడ్ టైట్ / సంచార గిరిజనులకు / పాక్షిక సంచార గిరిజనులకు, (iv) మిగిలిన (6) సీట్లు తీవ్రవాదుల దాడులలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులకు, ప్రాణాలు కోల్పోయిన పోలీస్, పేరా మిలటరీ, సాయుధ దళా సిబ్బంది యొక్క విద్యార్థులకు కోవిడ్ వలన తల్లిదండ్రులని కోల్పోయిన విద్యార్ధులకు, తండ్రిని కోల్పోయి కేవలం తల్లి సంరక్షణలో గల విద్యార్ధులకు, అనాధ విద్యార్ధులకు, విద్యాలయానికి భూమి ఉచితంగా ఇచ్చిన దాతల పిల్లలకు కేటాయించబడ్డాయి. ఇవి కూడా వ్రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు. ఈసీట్లకు గిరిజన విద్యార్ధులే కాకుండా అందరు దరఖాస్తు చేసుకోవచ్చును.
11. మొత్తం (60) సీట్లలో 5 % అనగా (3 )సీట్లలో విభిన్న సామర్థ్యం ( Differently abled) గల ST విద్యార్థులకు (2) సీట్లు, ఇతరులకు (1) సీటు కేటాయించడం జరిగింది.
12. విద్యార్ధులు ఆన్లైస్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ఈ దిగువ పేర్కొన్న ధృవీకరణ పత్రాలను తీసుకురావలెను.
(అ) విద్యార్ధి మరియు తల్లిదండ్రుల ఆదార్ కార్డు, (ఆ) కుల ధృవీకరణ పత్రం, (ఇ) నివాసస్థల ధృవీకరణ పత్రం, (ఈ) రేషన్ కార్డ్, (ఉ) దివ్యాంగులైన విద్యార్థులు సంబంధిత ధృవీకరణ పత్రం, (ఊ) పైన 11వ పాయింట్ నందు చెప్పిన కేటగిరీలకు చెందిన విద్యార్ధులు సంబంధిత ధృవీకరణ పత్రాలు, (ఎ) స్టడీ సర్టిఫికేట్, (ఏ) పుట్టిన తేది ధృవీకరణ పత్రం, (ఐ) జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొన్న ధృవీకరణ పత్రం (తప్పనిసరి కాదు), (ఒ) పాస్ పోర్ట్ సైజు ఫోటోలు 2.
13. వార్షిక ఆదాయం : తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,00,000/- దాటకుండా ఉండాలి. వైట్ రేషన్ కార్డు ఉన్న వారు (G.O.Ms.No.229, Dated.23.06.2017) ప్రకారం ఆదాయ పత్రం పెట్టనవసరం లేదు...
14. విద్యార్ధులు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించినప్పుడు ప్రాధాన్యతా క్రమంలో ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయంలో చేరదలచుకున్నారో 28 ప్రాధాన్యతలు నింపవలసి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమాన్ని బట్టి మరియు వ్రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మాత్రమే ప్రవేశం కల్పించబడుతుంది.
15. వ్రాత పరీక్ష 6వ తరగతికి 100 మార్కులకు, 7వ, 8వ & 9వ తరగతులకు 200 మార్కులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది.
16. వ్రాత పరీక్ష నిర్వహించు గురుకుల విద్యాలయములు: