Mahatma Jyotiba Phule AP Backward Classes Welfare Residential Educational Institutions Society 2023-24 5TH CLASS ADMISSION NOTIFICATION
మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా లయాల సంస్థ, అమరావతి.
మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2023 - 24 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కొరకు సమాచారం.
1. మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బి.సి. బాలబాలికల పాఠశాలల్లో 2023-24. విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీషు మీడియం) స్టేట్ సిలబస్ బిసి, ఎస్సీ, ఎస్టీ మరియు ఇ. బి. సి. అభ్యర్ధుల నుండి ప్రవేశానికి దరఖాస్తులు కోరడమైనది. ప్రవేశ పరీక్ష తేది: నాడు ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 వరకు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులననుసరించి, ఆయా MJP పాఠశాలల్లో పరీక్ష నిర్వహించబడును.
2. పరీక్ష కొరకు అర్హత:
వయస్సు: బిసి, ఇ.బి సి మరియు ఇతర విద్యార్ధులు, 9 నుండి 11 సంవత్సరాల వయస్సు మించి ఉండరాదు. వీరు 01.09.2012 మరియు 31.08 2014 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు 9 నుండి 13 సంవత్సరాల వయస్సు మించి ఉండరాదు. వీరు 01.09.2010 మరియు 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థుల తల్లితండ్రుల/ సంరక్షకుల సంవత్సర ఆదాయం రూ.1,00,000/- కు మించరాదు.
జిల్లాలోని గురుకుల పాఠశాలలలో ప్రవేశానికి ఆ జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో గత రెండు సంవత్సరాల నుండి నిరంతరంగా (2021-22, 2022-23) చదువుతూ ఉండాలి. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో 4వ తరగతి 2022-23 విద్యా సంవత్సరంలో చదివి ఉండాలి.
3. పాఠశాలలలో ప్రవేశం:
విద్యార్థుల ఎంపికకు ప్రతి జిల్లా ఒక యూనిట్ గా పరిగణించబడుతుంది. పట్టిక - 1 లో ఆయా జిల్లాలకు సీట్ల కేటాయింపు వివరాలు పొందుపరచడమైనవి
4. ప్రవేశ పరీక్ష: ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు, పరిసరాల విజ్ఞానం (సైన్స్ మరియు సాంఘిక శాస్త్రం) లలో 4వ తరగతి స్థాయిలో 2 గంటల వ్యవధిలో 50 మార్కులకు (తెలుగు 10. ఇంగ్లీష్-10, లెక్కలు . 15, పరిసరాల విజ్ఞానం 15 మార్కులలో ఆబ్జెక్టివ్ టైపులో - ఉంటుంది.
• జవాబులను ఓ.యం. ఆర్. షీట్ లో గుర్తించాలి. • పరీక్ష ప్రశ్నాపత్రం తెలుగు మరియు ఇంగ్లీష్ లో ఉంటుంది.
5. పరీక్షా కేంద్రం: విద్యార్ధిని విద్యార్ధులకు వారి సొంత జిల్లాలో మాత్రమే పరీక్ష నిర్వహించబడును. పరీక్షా కేంద్రం వివరాలు హాల్ టికెట్ లో ఇవ్వబడును. ఒక పరీక్షా కేంద్రంలో విద్యార్ధుల సంఖ్య తక్కువైనప్పుడు ఆ విద్యార్ధులను దగ్గరలోని ఇతర పరీక్షా కేంద్రాలకు కేటాయించబడును.
6. పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాధ / మత్స్యకార) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ప్రాధాన్యతల ఆధారంగా ఎంపిక చేయబడును.
ఏదేని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్ధులు లేని యెడల అట్టి ఎదేని రిజర్వేషన్ ఖాళీలను బి.సి. -కేటగిరీ అభ్యర్ధులకు కేటాయిస్తారు. SC మరియు ST రిజర్వేషన్ కేటగిరీలోను అభ్యర్ధులు లేని యెడల మార్చుకోనవచ్చును.
• ఎంపిక సమానమైన ర్యాంకు ఒకరికంటే ఎక్కువ మందికి వచ్చినప్పుడు పుట్టిన తేది ప్రకారం అధిక వయస్సు గల విద్యార్థికి ప్రాధాన్యత ఇవ్వబడును. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు వస్తే, లెక్కలలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అప్పుడు కూడా సమానమైన ర్యాంకు పొందితే, పరిసరాల విజ్ఞానంలో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు.
• జిల్లాల వారీగా పాఠశాల వివరాలు, ఆ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత గల జిల్లాలు పట్టిక-2 లో ఇవ్వబడినవి.
* ఎంపికైన విద్యార్థులు ప్రవేశానికి అర్హులు కానిచో అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు అధికారం ఉంది.
• ప్రవేశానికి ఎంపికైన విద్యార్ధుల హాల్ టిక్కెట్ నెంబర్లు https://mjpapbcwreis.apcfss.in వెబ్ సైట్ లో ఉంచబడతాయి.
• ప్రవేశానికి ఎంపికైన అభ్యర్ధులకు మాత్రమే ప్రవేశ అనుమతి పత్రాలు (కాల్ లెటర్స్) పంపబడును లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడును.
7. దరఖాస్తు చేయు విధానం:
అభ్యర్ధులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఏదేని (Payment ) ఏపీ ఆన్లైన్ కి ప్రాధమిక వివరాలతో (విద్యార్థి పేరు, పుట్టిన తేది, తండ్రి / సంరక్షకుని మొబైల్ నెం) వెళ్ళి రూ.100/- చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది. జర్నల్ నెంబర్ పొందినంత మాత్రాన దరఖాస్తు చేసుకున్నట్లు కాదు.. అది కేవలం ధరఖాస్తు రుసుము చెల్లించినట్లు తెలియజేయు నెంబర్ మాత్రమే.
ఆ జర్నల్ నెంబర్ ఆధారంగా ఏదేని ఇంటర్ నెట్ సెంటర్ లేదా కంప్యూటర్ నుండి వెబ్ సైట్ https://mjpapbcwreis.apcfss.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ఈ జర్నల్ నెంబరును పరీక్ష ఫీజు చెల్లించిన వివరాలకు కేటాయించిన స్థలం (కాలమ్) లో నమోదు చేయవలెను.
గడువు: ఆన్లైన్ దరఖాస్తును తేది 05.03.2023 నుండి తేదీ 04.04.2023 వరకు
చేసుకోవచ్చును. ఆన్లైన్ దరఖాస్తును పంపిన తరువాత ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడును. నింపిన ధరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ఉంచుకోవాలి.
• దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్ధి వద్ద కుల ధృవీకరణ, (సమీకృత కుల, జనన ఆదాయం ధృవ పత్రాలు) పుట్టిన తేదీ, ఆదాయ ధృవీకరణ, ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ, స్టడీ మరియు బోన ఫైడ్ సర్టిఫికేట్ మొదలగు దృవపత్రాలు (ఒరిజినల్) పొంది ఉండాలి. దృవ పత్రాల ఒరిజినల్ కౌన్సిలింగ్ సమయంలో సమర్పించాలి. లేని ఎడల విద్యార్ధి ఎంపిక కాబడిన సీటు ఇవ్వబడదు. ఆన్లైన్ లో కాక నేరుగా సంస్థకు కానీ, గురుకుల పాఠశాలకు గాని మరియు ఇ-మెయిల్ ద్వారా గాని పంపిన దరఖాస్తులను పరిశీలించారు. అట్టి అభ్యర్థులను పరీక్షకు అనుమతించరు.
• హాల్ టికెట్లు పరీక్ష తేదీకి 7 రోజులు ముందుగా తమ రిఫరెన్స్ నెంబర్ ద్వారా హాల్ టిక్కెట్లు దగ్గరలోని ఎదైన ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటరు నుండి | డౌన్ లోడ్ చేసుకోవచ్చును.
• హాల్ టిక్కెట్లు పోస్టులో గాని, నేరుగా కానీ అభ్యర్ధులకు పంపబడవు, కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి.అర్హత లేని అభ్యర్థుల దరఖాస్తులు పరిశీలించబడవు.
8. దరఖాస్తు నింపుటకు అభ్యర్ధులకు కొన్ని ముఖ్య సూచనలు:
• దరఖాస్తును ఆన్లైన్ లో నింపడానికి ముందుగా నమూనా దరఖాస్తు నింపుకోవాలి.
• పరీక్షా కేంద్రాన్ని వారి సొంత జిల్లాను మాత్రమే ఎంపిక చేయాలి. పాఠశాల ప్రాధాన్యతాక్రమము ఎంచుకోవడానికి ముందు పాఠశాలల పట్టికను చూసుకొని నింపాలి.
• పాస్ పోర్ట్ సైజు ఫోటో ను సిద్ధంగా ఉంచుకోవాలి.
• దరఖాస్తులను నింపునప్పుడు అభ్యర్ధి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. • సెల్ నెంబర్ వ్రాయునపుడు విద్యార్ధి కుటుంబమునకు సంబంధించిన నంబరు లేదా
సమీప బంధువులు నంబరు ఇవ్వవలయును.
• దరఖాస్తు నింపుటకు జరుగు పొరపాట్లకు అభ్యర్ధియే పూర్తి భాధ్యత వహించాలి. తదుపరి
ఏ విధమైన మార్పులు చేయబడవు.
• ఒకసారి దరఖాస్తును ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు తావులేదు. కావున దరఖాస్తును అప్లోడ్ చేయుటకు ముందే అన్ని వివరాలు చూసుకోవాలి.
• ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ అమలు చేయబడును. - 1 లో చూపించిన విధంగా ఆయా జిల్లాల విద్యార్థిని విద్యార్థులు ఆయా పాఠశాలలలో ప్రవేశానికి అర్హులు ఒక పాఠశాల నుండి వేరొక పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో బదిలీ చేయబడదు.
విద్యార్థులకు అందించే సదుపాయాలు:
• ఉచిత వసతి మరియు గురుకుల విధానం లో చదువుకునే అవకాశం
• నెలకు రూ. 1400/- ల తో పౌష్టిక విలువలతో కూడిన మెనూ
4 జతల యూనిఫారం దుస్తులు
దుప్పటి మరియు జంఘ్ కాన
• బూట్లు, సాక్స్
• టై మరియు బెల్ట్
• నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు కాస్మోటిక్ చార్జీల నిమిత్తం బాలురకు నెలకు 125/- రూ.ల చొప్పున (5,6),7 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 150/- రూ.ల బాలికలకు 6,7 వ తరగతుల వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 130/-రూ చొప్పున మరియు 8వ తరగతి ఆఫై క్లాసుల పిల్లలకు నెలకు 250/- రూ.ల చొప్పున చెల్లించడం జరుగుతున్నది మరియు బాలురకు నెలకు రూ.50/- చొప్పున సెలూను నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.
5వ తరగతి ప్రవేశం పొందిన విద్యార్ధి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలల్లోనే విద్యను అభ్యసించ వచ్చును.
సమీకృత పౌష్టిక ఆహారం క్రింది రొజూ వేరుశనగ చిక్కి, వారానికి ఆరు దినములు గ్రుడ్డు రెండు సార్లు చికెన్ ఇవ్వబడును. ఉల్లాసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావారణం లో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది. క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో కూడా శిక్షణ ఉంటుంది. గ్రంధాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యా బోధన జరుగుతుంది . దరఖాస్తులను ఆన్లైన్లో https://mjpapbcwreis.apcfss.in.వెబ్ సైట్ లో ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకోగలరు |
పూర్తి వివరాల కొరకు ఏదైనా మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయం నందు కానీ లేదా విజయవాడలో గల సంస్థ కార్యాలయం, ప్లాట్ నెం: 9, స్ట్రీట్ నం.4, బండి స్టాన్లీ స్ట్రీట్, ఉమాశంకర్ నగర్, కానూరు, విజయవాడ కార్యాలయంలో కార్యాలయ పని వేళల్లో స్వయంగా సంప్రదించగలరు.
DOWNLOAD BC WELFARE 5TH CLASS ADMISSION NOTIFICATION 2023-24