DOWNLOAD AP Constable SCT PC PMT / PET CALL LETTERS 2023
ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ / ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తేదీని ఏపీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసింది. మార్చి 13, 2023 నుంచి పీఎంటీ / పీఈటీని నిర్వహించనున్నట్లు సంస్థ అధికారులు సంబంధిత వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. స్టేజీ 2 దరఖాస్తు నమోదు ప్రక్రియ ఫిబ్రవరి 20 ముగియడంతో తదుపరి రిక్రూట్మెంట్ వివరాలను ప్రకటనలో పొందుపరిచారు. రాష్ట్రంలో 6,100 పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో భాగంగా నిర్వహించనున్న ఫిజికల్ ఈవెంట్ల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ప్రిలిమినరీలో పాస్ అయిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి.. మార్చి 10 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీఎంటీ / పీఈటీ కాల్ లెటర్లు మార్చి 01, 2023 నుంచి మార్చి 10, 2023 వరకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ చివరి వారంలో మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
DOWNLOAD AP Constable SCT PC PMT / PET CALL LETTERS 2023 CLICK HERE