CBA1 EXAM INSTRUCTIONS -GUIDELINES 2023
పరీక్షలు నిర్వహించడానికి ముందుగా పాటించవలసిన సాధారణ సూచనలు:
(పరీక్ష నిర్వహించే ముందు ఈ క్రింది సూచనలను సరిగ్గా చదవండి.)
1. ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య తగినంత దూరంతో విద్యార్థులందరూ సరిగ్గా కూర్చున్నట్లు నిర్ధారించుకోండి.
2. విద్యార్థులు తమ పెన్నులు/పెన్సిళ్లను బయటకు తీసి సిద్ధంగా ఉంచుకున్నారని నిర్ధారించుకోండి.
3. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేయండి.
4 ప్రశ్నాపత్రాలలో రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి.
i) బహుళైచ్చి ప్రశ్నలు (MCQ)- బహుళైచ్ఛిక ప్రశ్నలకి 3 నుండి 4 ఎంపికలు ఇవ్వబడతాయి, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైన సమాధానమౌతుంది.
ii) ఎంపికలు లేని ప్రశ్నలు (FR: Free Response) ఈ ప్రశ్నలకి ఎంపికలు ఉండవు. ఇటువంటి ప్రశ్నలకు మార్కులకు అనుగుణంగా సమాధానాలు వ్రాయవలసి ఉంటుంది.
5. CBA -1 ప్రశ్నల సంఖ్య మరియు మార్కుల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
6. అన్ని పేపర్లకు పరీక్షా సమయం 1 గంట మాత్రమే
7. ప్రశ్నల సంఖ్య గురించి విద్యార్థులకు ముందుగా తెలియజేయండి. ప్రశ్నాపత్రంలో ఈ సమాచారం, పైన లేబుల్ లో ఇవ్వబడుతుంది.
8. సబ్జెక్టు వివరాలు, పరీక్ష ప్రారంభ సమయం మరియు ముగింపు సమయం బ్లాక్ బోర్డపై వ్రాయబడ్డాయని నిర్ధారించుకోండి.
9. ప్రతి పరీక్ష ముందు విద్యార్థికి OMR అందచేయవలసి ఉంటుంది. OMR పై ఇవ్వబడిన విద్యార్థి యొక్క అన్ని వివరాలు (విద్యార్థి ID,విద్యార్థి పేరు, UDISE కోడ్ మరియు తరగతి) సరిచూసుకొనవలెను.
10. 1వ తరగతి నుండి 5 వ తరగతుల వారికి ఇచ్చే OMR షీట్ 4 సబ్జెక్టులు (తెలుగు, ఇంగ్లీషు, గణితం, EVS) కలిగి ఉంటుంది.
11. 1వ, 2వ తరగతులకు EVS పరీక్ష లేనందున వారి OMR లలో EVS నకు కేటాయించబడిన భాగంలో ఎటువంటి సమాధానాలు గుర్తించకుండా జాగ్రత్త వహించండి.
12. 6 వ తరగతి నుండి 8 వ తరగతుల వారికి ఇచ్చే OMR షీట్ 6 సబ్జెక్టులు (ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం) కలిగి ఉంటుంది.
13. 3 నుండి 9 తరగతుల వరకు ఇంగ్లీషు సబ్జెక్ట్ లో part B విభాగం క్రింద TOEFL టెస్ట్ నిర్వహించబడును. కావున 3 నుండి 8 తరగతుల విద్యార్థుల చేత ఇంగ్లీషు part B భాగంలో సంబంధిత సమాధానాలు గుర్తించునట్లుగా సరిచూసుకోవలెను. TOFEL పరీక్షకు సంబంధించిన సూచనలు విడిగా జత చేయబడ్డాయి.
14. సరైన OMR లేకపోయినా లేదా OMR లభించక పోయినా, మండల స్థాయిలో అందుబాటులో ఉన్న బఫర్ OMRని విద్యార్థికి అందజేయాలి. OMR షీటులో విద్యార్థుల వివరాలన్నీ మాన్యువల్ గా నమోదు చేయాలి.
15. విద్యార్థులు సమాధానాలను సంబంధిత సబ్జెక్టులకు కేటాయించిన భాగంలోనే గుర్తించేట్లుగా ఇన్విజిలేటర్లు జాగ్రత్త తీసుకొనవలెను.

16. అందించిన ఆన్లైన్ పోర్టల్ లో విద్యార్థుల హాజరు వివరాలను పూరించండి.
17. క్లాస్ట్రూమ్ బేస్డ్ అసెస్మెంట్ -1 పూర్తయిన తర్వాత ఆన్సర్ కీ విడుదల చేయబడుతుంది.
18. ప్రశ్నాపత్రాలపై టిక్ చేసిన సమాధానాల ఆధారంగా, పేపర్లు దిద్దబడుతాయి.
Packaging Instructions
1. మండల స్థాయికి ఒక ప్యాకెట్ ద్వారా అన్ని పాఠశాలలు OMR లు చేరతాయి.
2. మండలం నుండి ప్రతి పాఠశాల HM కు సంబంధిత పాఠశాల OMRలు, ఒక ఖాళీ ప్యాకెట్ అందించబడుతుంది.
3. మండల కేంద్రం నుండి OMRలు తీసుకునేటప్పుడు సంబంధిత U-DISEతో సరిచూసుకొని తీసుకొనవలెను.
4. 1,6 తరగతులకు బఫర్ OMRలు తగు సంఖ్యలో తీసుకోవలెను.
5. ఉపయోగించిన బఫర్ OMRల డేటాను ఆన్లైన్ అటెండెన్స్ ఆఫ్ లో నమోదు చేయవలెను.
6. అన్ని సబ్జెక్టుల అసెస్మెంట్ పూర్తయిన తర్వాత, ఉపయోగించిన OMR షీట్లు అదే ప్యాకెట్ లో తిరిగి మండల కార్యాలయంలో అందించవలసి ఉంటుంది.
7. మండల స్థాయిలో, అన్ని పాఠశాలల OMRలు ఒకే ప్యాకెట్లో ఉంచి జిల్లా కేంద్రాలకు పంపించాలి.
8. తరగతుల వారీగా, పాఠశాల వారీగా విడివిడి ప్యాకింగ్ చేయరాదు.
Specific Instructions for Test administration - Classes 1, 2 and 3
1. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన టేబుల్ పై UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను పూరించండి.
2. ప్రతి సబ్జెక్టులో అన్ని ప్రశ్నలను ఉపాధ్యాయులు గట్టిగా చదివి విద్యార్థులకి వినిపించాలి.
3. ప్రశ్నాపత్రంలోని ఒక్కొక్క ప్రశ్నను గట్టిగా మరియు నిధానంగా చదివినట్లయితే, విద్యార్థులు సులభంగా అర్థం అవుతుంది.
4. ఒక ప్రశ్న చదవడం పూర్తయిన తర్వాత, విద్యార్థులు తమ ప్రశ్నాపత్రాల్లో సమాధానాలను గుర్తించడానికి తగినంత సమయం ఇవ్వండి. అవసరమైతే ప్రశ్నను మరలా ఇంకొక్కసారి చదివి వినిపించండి.
5. విద్యార్థులు, ప్రశ్నాపత్రాలలో వారు అమకున్న సమాధానాలను సరిగ్గా గుర్తిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.
6. విద్యార్థులకు, ప్రశ్నాపత్రాలకు చెందిన అదనపు సూచనలు లేదా సహాయం లేదా సమాధానాలకు సంబంధించిన క్లూలు ఇవ్వకూడదు.
7. బ్లాక్ బోర్డపై, ప్రశ్నాపత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని విద్యార్థులకి చూపండి.
8. ఎంపికలు లేని ప్రశ్నలకి, ప్రశ్నాపత్రాలలో సమాధానాలను స్పష్టంగా రాయమని విద్యార్థులకి తెలియజేయండి. పరీక్ష పూర్తయిన తర్వాత, ప్రశ్నాపత్రాలను తిరిగి తీసుకోండి. ప్రశ్నలకు సమాధానాలను విద్యార్థులు సరిగ్గా నింపాడో లేదో చూసుకోండి.
9. సంబంధిత సబ్జెక్టు పరీక్ష పూర్తయిన తర్వాత, విద్యార్థులు ప్రశ్నాపత్రాలలో వ్రాసి ఇచ్చిన బహుళైచ్చిక ప్రశ్నలకు సమాధానాలను OMR లతో సంబంధిత సబ్జెక్ట్ కింద బాల్ పెన్నుని ఉపయోగించి ఇన్విజిలేటర్ గుర్తించాలి.
10. 3వ తరగతి EVS పరీక్ష వ్రాస్తున్నవారు, EVS కాలమ్ కింద వారి సమాధానాలను గుర్తించాలి.
11. OMR షీట్లో విద్యార్థి సమాధానాలను గుర్తించేటప్పుడు, విద్యార్థి పేరు, విద్యార్థి ID వివరాలు ప్రశ్నాపత్రంపై పేరుతో సరిపోలుతున్నట్లు నిర్ధారించుకోండి.
ప్రతి పరీక్ష పూర్తయిన తర్వాత, విద్యార్థులు OMRలో ఏదైనా ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించకపోయినట్లయితే E ఎంపికను గుర్తించండి..Specific Instructions for Test administration - Classes 4 to 8:
1. బోర్డుపై UDISE కోడ్ వ్రాసి, విద్యార్థి IDలు సిద్ధంగా ఉండేలా చూసుకోండి. అంతేకాకుండా పరీక్షకు ముందుగా విద్యార్థులకు ఈ ID గూర్చి తెలియచేయండి.
2. విద్యార్థులు ప్రశ్నాపత్రంలో UDISE కోడ్, విద్యార్థి ID మరియు విద్యార్థి పేరు వివరాలను సరిగ్గా వ్రాసినట్లు నిర్ధారించుకోండి.
3. OMR షీట్లను ప్రతి పరీక్ష ముందు అందచేయవలసి ఉంటుంది.
4. OMR షీటుపై UDISE కోడ్, విద్యార్థి పేరు మరియు విద్యార్థి ID వివరాలు ఇవ్వబడతాయి. కాబట్టి OMR షీటులను విద్యార్థులకు అందజేస్తున్నప్పుడు, ప్రతి విద్యార్థి వారి సంబంధిత OMRని పొందారని నిర్ధారించుకోండి.
5. విద్యార్థులు, OMR షీటులను జాగ్రత్తగా నలపకుండా ఉంచేలా జాగర్త వహించండి.
6. విద్యార్థులు ప్రశ్నాపత్రాలపై సమాధానాలను టిక్ చేసి, వాటిని OMR పై సరిగ్గా బబుల్ చేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.
7. ప్రశ్నాపత్రాలపై సమాధానాలను గుర్తించే పద్ధతిని బ్లాక్ బోర్డ్ పై విద్యార్థులకి చూపండి.
8. OMRలలో బహుళైచ్చిక ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి.
9. ప్రతి బహుచ్చిక ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయని, వాటిలో ఒక ఎంపిక మాత్రమే సరైనదని విద్యార్థులకు సూచించండి.
10. బ్లాక్ బోర్డు పై OMR బబ్లింగ్ చేసే పద్దతిని విద్యార్థులకు చూపండి. బబ్లింగ్ సరిగ్గా ఎలా చేయాలో విద్యార్థులు అర్థం చేసుకోవడం చాలా. అవసరం. విద్యార్థులు సమాధానాలను సరిగ్గా బబ్లింగ్ చేస్తున్నారో లేదో తనిఖీ చేయండి.
11. ఎంపికలు లేని ప్రశ్నలకి, విద్యార్థులకి అందజేసిన సమాధాన పత్రాలలో సమాధానాలను వ్రాయమని విద్యార్థులకు సూచించండి.
12. ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందజేసిన తర్వాత, విద్యార్థులు పరీక్షను ప్రారంభించే ముందు, ఒకసారి ప్రశ్నాపత్రాన్ని నిశ్శబ్దంగా చదవమని వారికి తెలపండి,
13. సంబంధిత సబ్జెక్టు కింద సమాధానాలను గుర్తించాలని విద్యార్థులకు సూచించండి. ఉదాహరణకు: ఇంగ్లీషు సబ్జెక్టు యొక్క సమాధానాలను ఇంగ్లీష్ కాలమ్ క్రింద గుర్తించాలి.
14. 4 మరియు 5వ తరగతి విద్యార్థులకు, తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్సులలోని ఉన్న పాసేజ్ లను మాత్రమే గట్టిగా చదివి వినిపించాలి. విద్యార్థులందరికీ అర్థమయ్యేలా పాసేజ్ ని గట్టిగా మరియు నిధానంగా చదవాలి. అవసరమైతే ఆ భాగాన్ని మరలా ఇంకోసారి చదవి వినిపించండి.
15. పరీక్ష పూర్తయిన తరువాత ప్రశ్నాపత్రాలు, OMR షీట్లను తిరిగి తీసుకోండి.
AP TOEFL Exam Pattern - Structure - MODEL PAPERS DOWNLOAD