Type Here to Get Search Results !

GER పై చాలెంజ్! డేటా తప్పయితే, ప్రవీణ్ ప్రకాష్ సర్ రాజీనామా ? - VIDEO LINK

 GER పైన ప్రవీణ్ సర్ సంచలన నిర్ణయం

 

Above Video Direct Link : https://youtu.be/gi8_0E8c9I8


100 పర్సెంట్ G E R సాధించడమే లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ లోని సెప్టెంబర్ 2005 మరియు ఆగస్టు 2018 మధ్య జన్మించిన పిల్లలందరూ పాఠశాలల్లో నమోదు అయ్యేవిధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ ప్రకాష్ గారు కోరారు, ఈ కార్యక్రమాన్ని విలేజ్ వాలంటీర్లు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపల్ జిల్లా అధికారులు, కలెక్టర్లు అందరూ కలిసి సెప్టెంబర్ 4వ తేదీ లోపు పూర్తి చేయాలని తెలియజేశారు సెప్టెంబర్ 4న పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఏ ఒక్క లేదా బాలిక నమోదు కాకుండా నమోదు చేయబడిన అంశాలు తప్పుగా ఉన్న తన ఉద్యోగానికి ఐఏఎస్ కు రాజీనామా చేస్తానని చాలెంజ్ చేశారు.  కావున విలేజ్ వాలంటీర్లు విలేజ్ వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ సమన్వయంతో నూరు శాతం  జి ఈ ఆర్ సాధించాలని అదేవిధంగా ఆ డేటా అంతా స్వచ్ఛమైనదిగా ఉండాలని ఎక్కడ పొరపాట్లకు తాగకుండా చేయాలని కోరారు
ప్రపంచంలో ఉన్న 3500 స్థానిక ప్రభుత్వాలు అనగా స్టేట్ గవర్నమెంట్ అదేవిధంగా 250 వరకు ఉన్న ఫెడరల్ గవర్నమెంట్ తో కలిపి దాదాపు 3800 ప్రభుత్వాలు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూరు శాతం జీ ఈ ఆర్ సాధించిన రాష్ట్రంగా అవతరించాలని, ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రం గురించి చర్చ జరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు, ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నాలుగు ప్రకారం బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో నమోదు కావడం తప్పనిసరి కావున ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో నిర్వహించాలని ఆయన కోరారు


GER పై చాలెంజ్ .ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా ?

ప్రపంచంలో ఎక్కడా లేని వాలంటీర్స్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంది . విద్యాశాఖ ,రెవెన్యూ శాఖ, విలేజ్ వార్డ్ సచివాలయం శాఖ సమన్వయంతో 5 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వరకు గల ప్రతి ఒక్క విద్యార్థి ఏదైనా పాఠశాలలో కానీ, ఓపెన్ స్కూల్లో మరియు స్కిల్ సెంటర్లలో కానీ, కాలేజీలో గాని ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి .దేశంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఆంధ్రప్రదేశ్ మొట్టమొదట 100% సాధించిన రాష్ట్రంగా ఖ్యాతి పొందాలి. సెప్టెంబర్ ఐదు కల్లా ఈ టార్గెట్ ను పూర్తి చేయాలి. ఆరోజు మేము ఇచ్చే డేటా నుండి ఏ ఒక్క విద్యార్థి డేటా తప్పు అయినా నేను ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తాను. ఇది ఛాలెంజ్. 

ఇట్లు
 ప్రవీణ్ ప్రకాష్ ప్రకాష్

 ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పాఠశాల విద్యాశాఖ

Above Video Direct Link : https://youtu.be/gi8_0E8c9I8

Top Post Ad

Below Post Ad