NAS - SEAS - SLAS SURVEY IMPORTANT INSTRUCTIONS
1. దేశంలోని అన్ని ప్రాంతాలలో నవంబర్ 3వ తేదీన ఈ సర్వే జరుగును.
2. మండల స్థాయి, విద్యా స్థాయి పై నివేదిక ఇవ్వబడుతుంది. కనుక ఏ మండలం లో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయో తెలియచేసే ఒక ముఖ్యమైన సర్వే.
3. ఈ సర్వే క్రింది అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ లో జరుగును.
4. FI లు పాఠశాలకు ప్రార్ధన సమావేశానికి వెళ్ళాలి.
5. FI లు తమ నియామక పత్రాన్ని పాఠశాల HM గారికికి చూపించి సర్వే నిర్వహించాలి..
6. సెక్షన్ శాంప్లింగ్, స్టూడెంట్ శాంప్లింగ్ FI చేయాలి..
7. 3వ తరగతి విద్యార్థులకు సర్వే ప్రశ్న పత్రం లో సరియైన సమాధానం సంఖ్య పై పెన్సిల్ తో వృత్తం చుట్టమని చెప్పాలి.
8. సర్వే అనంతరం 3వ తరగతి విద్యార్థుల OMR లో మరియు PQ FI బ్లాక్ పెన్ తో బబల్ చేయాలి.
9. 6, 9 తరగతుల విద్యార్థుల సమాధానాలు విద్యార్థులే బబల్ చేయాలి.
10. ప్రధాన సర్వే అనంతరం PQ సర్వే కూడా ఇదే తరహాలో చేయాలి.
11. ఒకే పేపర్ పై సైడ్ A లో మెయిన్ OMR మరియు సైడ్ B లో PQ OMR ఉంటాయి.
12. PQ సర్వే సమాధానాలు కూడా OMR లోనే పైన చెప్పిన సిధం గానే నమోదు చేయాలి.
13. TQ ని ఉపాధ్యాయులు. SQ సర్వే ని ప్రధానోపాధ్యాయులు పూర్తీ చేయాలి.
సర్వే అనంతరం, మెటీరియల్ను 4 ఫ్యాక్ లుగా చేయవలెను. ప్యాకెట్ లోపల కూడా క్రింది అర్డర్ నే ఫాలో అవ్వవలెను.
ప్యాకెట్ 1:
1 : SQ OMR
2: TQ OMR
3: PQ OMR & MAIN ANSWER OMR (ఈ రెండు రకాల OMR లు) ఒకే పేపర్ పై SIDE - A మరియు SIDE- B గా ముద్రించబడతాయి. కావున ఒకే CMR షీట్ ఉంటుంది.పై మూడు కూడాను మూడు విడివిడి పాలిథిన్ కవర్లలో ఉంచి ఆ మూడిటిని కలిపి ఒక ప్యాకెట్ గా చేసి సీల్ చేయవలెను.
ప్యాకెట్ 2:
1. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ నింపబడిన ఫీల్డ్ నోట్స్
2. ఫీల్డ్ ఇన్వెస్టిగేటరుకి పంపిణీ చేయబడిన మానిటరింగ్ ప్రొఫార్మా
3. చెక్ లిస్టు మరియు
4. శాంపిలింగ్ షీట్ ఈ షీట్ ను ప్రత్యేకమైన పాలిథిన్ కవర్లో ఉంచవలెను.
ప్యాకెట్ 3:
1. ఉపయోగించబడిన (USED) SQ క్వశ్చన్ పేపర్
2. ఉపయోగించబడిన (USED) TQ క్వశ్చన్ పేపర్ (ఇవి రెండూ ఉంటాయి : లాంగ్వేజ్ కి ఒక టీచర్ గారు మాడ్స్ కి ఒక టీచర్ గారి చే నింపబడినవి.)
3. ఉపయోగించబడిన (USED) PQ క్వశ్చన్ పేపర్
4. ఉపయోగించబడిన (USED) TEST క్వశ్చన్ పేపర్స్ (ఇవి ఎంతమంది విద్యార్థులు రాస్తే అన్ని అచీవ్మెంట్ టెస్ట్ పేపర్లు ఉంటాయి).
ప్యాకెట్ 4:
1. అన్ని ఉపయోగించబడని (UN USED/EXCESS TQ క్వశ్చన్ పేపర్లు)
1. అన్ని ఉపయోగించబడని (UN USED/EXCESS SQ క్వశ్చన్ పేపర్లు.)
3. అన్ని ఉపయోగించబడని (UN USED / EXCESS / ABSENTEES PQ క్వశ్చన్ పేపర్లు)
4.అన్ని ఉపయోగించబడని (UN USED/EXCESS/ABSENTEES అచీవ్మెంట్ టెస్ట్ క్వశ్చన్ పేపర్లు.)
5. అన్ని ఉపయోగించబడని (UN USED/EXCESS ఫీల్డ్ నోట్స్ లు, మానిటరింగ్ PROFORMA లు, చెక్ లిస్టులు మొదలగు ఏ ఇతర ఎక్సెస్ పేపర్లు ఉన్న అన్ని ప్యాకెట్ నెంబర్ 4 లోకి రావలెను.)
ప్యాకింగ్ పూర్తయిన తర్వాత సంబంధిత పాఠశాల హెచ్ఎం గారు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పాఠశాలపేరు, U-DISE, MEDIUM, NO OF ALLOTED. NO OF ATTENDED. NO OF ABSETEES వ్రాసి, సీల్ చేసి, పైన సంతకం చేయవలెను.