HOW TO APPLY AP GRADUATE - TEACHER MLC ELECTIONS 2024 - FORM 18- FORM 19 DOWNLOAD
AP GRADUATE MLC ELECTIONS 2024 - FORM 18 DOWNLOAD
AP TEACHER MLC ELECTIONS 2024 - FORM 19 DOWNLOAD
సెప్టెంబర్-30,2024 to నవంబర్-6,2024 లోపు ఓటు నమోదు చేసుకోవాలి
మార్చి 2025 లో జరిగే గుంటూరు-కృష్ణ మరియు ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ MLC నియోజక వర్గాలకు అలాగే
- ఉత్తరాంధ్ర టీచర్ MLC ఎన్నికల కు ఓటు నమోదుకు షెడ్యూల్ తో నగారా మోగింది .
- పాత ఓటరు లిస్టు ఉండదు.అందరూ మరలా క్రొత్తగా ఓటర్లు గా నమోదు కావలసిందే
- Graduate MLC ఎన్నికలకు Form 18 లో Teacher MLC ఎన్నికలకు Form 19 లో ఓటును Sept 30 నుండి Nov 6 మధ్య ఆఫ్/ ఆన్ లైన్లో నమోదు చేసికొనవచ్చును
- ఏదైనా Degree పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజక వర్గాల పరిధి లో నివసించే వారందరూ Graduate MLC ఓటరు గా నమోదు చేసికొనవచ్చును
- Graduate MLC ఓటు నమోదుకు Form 18 తో పాటు
- Graduate Degree Provisional/Orignal Attested Zerax copy, Photo, Aadhar (Optional) Copy, Voter id/Residence proof Copy ను జత చేసి నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇవ్వాలి
- Teacher MLC ఎన్నికల నియోజక వర్గాలలో* నివాసము ఉండి ఏదేని ( ఇతర జిల్లాలో ఉన్నదైనా సరే)
- Recognised Secondary School ఆ పైన Institution లో పని చేయుచూ Nov 1 నాటికి గత 6 యేళ్ళలో 3 ఏళ్ళ సర్వీసు నిండిన టీచర్లు ఓటరు గా Form 19 లో నమోదుకు అర్హులు
- Form 19 తో Photo, Service certificate, Aadhar(Optional), Voter id /Residence proof లను Attach చేసి , నివాసమున్న మండల తహశీల్దారు ఆఫీసులో ఇచ్చి రశీదు పొందవచ్చును
- Online లో కూడా Submit చేయవచ్చును
- Graduate /Teacher MLC ఓటరు గా నమోదు అగుటకు Assembly Election ఓటరు గా ఉండవలసిన పని లేదు
- ఈ రెండు రకాల MLC ఎన్నికలకు కావలసినది నివాసము మరియు అర్హత మాత్రమే
- Online లో పంపిన దరఖాస్తులకు మరల ఇంటికి వెరిఫికేషన్ కు వచ్చినప్పడు Certicate Copies ఇవ్వాలి
- అదే Offline దరఖాస్తులకు ఇవ్వనవసరము లేదు, నివాసము ఉంటున్నారా లేదా అని మాత్రమే వెరిఫై చేస్తారు
- మార్చి 2025 లో జరిగే ఈ MLC నియోజక వర్గాల పరిధి లో టీచర్లు/ గ్రాడ్యయేట్లు అందరూ బాధ్యత గా Form 18/19 ద్వారా ఓటరు గా నమోదు చేసుకొనగలరు