Type Here to Get Search Results !

International-mother-tongue-day-February-21st-full-details

International-mother-tongue-day-February-21st-full-details



మాతృబాషా దినోత్సవం


మీకు తెలిసినట్లుగా, మాతృభాష యొక్క వ్యాప్తిని ప్రోత్సహించడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా భాషా మరియు సాంస్కృతిక సాంప్రదాయం పట్ల అవగాహన కలిగించడానికి  మరియు సహనం మరియు సంభాషణలను అర్థం చేసుకోవడం ఆధారంగా సంఘీభావాన్ని ప్రేరేపించడానికి యునెస్కో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21 ను అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవం గా ప్రకటించింది,


మాతృభాష వాడకాన్ని ప్రోత్సహించడానికి 21-2-2020 న మాతృబాష దినోత్సవం  జరుపుకోవాలని నిర్ణయించారు.


ఇది దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మరియు రాష్ట్ర / జిల్లా స్థాయిలో ఈ క్రింది లక్ష్యాలతో వేడుకగా జరుపుకోవాలి.




  • మన దేశ భాషా వైవిధ్యాన్ని హైలైట్ చేయండి.




  • సంబంధిత మాతృభాష మాత్రమే కాకుండా ఇతర భారతీయ భాషలను కూడా వాడండి




  • భారతదేశంలోని సంస్కృతుల వైవిధ్యం మరియు సాహిత్యం, హస్తకళ, ప్రదర్శన కళలు, స్క్రిప్ట్‌లు మరియు సృజనాత్మక వ్యక్తీకరణ యొక్క ఇతర రూపాల ఫోరమ్‌లను అర్థం చేసుకోవడం మరియు దృష్టిని ఆకర్షించడం.




  • ఒకరి మాతృబాష కాకుండా ఇతర బాషలు నేర్చుకోవడానన్ని ప్రోత్సహించడానికి..




మాతృబాషా దినోత్సవం సూచనాత్మక కార్యకలాపాల జాబితా జతచేయబడినది. ఒకవేళ పరీక్షలు మొదలైన వాటి కారణంగా పాఠశాలలు మరియు విద్యాసంస్థలు 21.02.2020 న మూసివేయబడితే, 20.02.2020 న జరుపుకునేందుకు వాటిని అంగీకరించవచ్చు.


మాతృబాషా దినోత్సవం యొక్క లక్ష్యాలను సాధించడానికి పై కార్యకలాపాలను నిర్వహించడానికి మీ పరిధిలోని అన్ని పాఠశాలలను ప్రోత్సహించాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.


సూచించే కార్యకలాపాల జాబితా




  • మాతృబాషలో రాజ్యాంగం యొక్క ముందుమాట పఠనం




  • మాతృబాషలో రాజ్యాంగం లోని "ఉపోద్ఘాతం" పఠనం




  • సమూహం / జానపద పాటలు




  • వ్యాసరచన పోటీలు




  • చర్చలు




  • డిస్ప్లే బోర్డులు, పోస్టర్లు మొదలైన వాటి ద్వారా భారతీయ భాషలపై ప్రదర్శన.




  • భారతీయ భాషా వారసత్వంపై జికె పోటీ




  • ఇతర కార్యక్రమాలు











అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం..


ఇంగ్లిష్ మోజులో అమ్మ భాషను మరవొద్దు


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ (1999 నవంబరు 17న) ప్రకటించింది.


మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. తల్లి ఒడే బిడ్డకు తొలి బడి. తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఎలా పిలుస్తాడో.. మాతృభాష కూడా అంతే. మాతృభాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వస్తుంది.


అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి. మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకోవడంలో తప్పులేదు.


అయితే వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా చూసుకోవాలి.


మాతృభాషను పరిరక్షించుకోవాలి. ఈ కర్తవ్యాన్ని గుర్తుచేసేందుకే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణ మహాసభ (1999 నవంబరు 17న) ప్రకటించింది.


2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషా పరిరక్షణ కార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలన్నిటినీ రక్షించుకోవాలని, భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారానే మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. బహుభాషల విధానాన్ని ప్రోత్సహించాలని, అది విశాల దృష్టిని, శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందిస్తుందని యునెస్కో ప్రకటించింది. అయితే మాతృభాషను కాపాడుకుంటూనే దాని ద్వారానే తక్కిన భాషల్ని నేర్చుకోవడం, అనంత విజ్ఞానాన్ని పొందడం సరైన మార్గం అని యునెస్కో వెల్లడించింది.


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఏటా ఒక థీమ్‌ను కూడా యునెస్కో ప్రకటిస్తోంది.


‘అభివృద్ధి, శాంతిభద్రతలు, సయోధ్యకు దేశీయ భాషలు దోహదపడతాయి’ అనేది ఈ ఏడాది థీమ్. పారిస్‌లో ఉన్న యునెస్కో కేంద్ర కార్యాలయంలో ఫిబ్రవరి 21న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఏడు సెమినార్లు, ఒక వర్క్‌షాప్ జరగనున్నాయి. ‘భాషల లెక్కింపు’పై ఒక డిబేట్ కూడా జరగనుంది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భాషలను సంరక్షించడం, ఇతర భాషలను నేర్చుకోవడానికి మాతృభాషనే ఉపయోగించుకోవడమే ప్రధాన అంశంగా యునెస్కో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.


తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషలోని మాధుర్యం, గొప్పతనం ఇక ఏ భాషలోనూ లేదని చాలా మంది కవులు చెప్పారు. నేటి ప్రపంచంలో దేశాల మధ్య, దేశ ప్రజల మధ్య సంబంధాలు ఎంతగానో పెరిగాయి. అనేక రకాలైన పనుల కోసం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లడం సర్వ సాధారణమైపోయింది. అందు వల్ల ఇంగ్లిష్ అంతర్జాతీయ భాషగా ఆమోదం పొందింది.










అయితే ఈ ఇంగ్లిష్ భాష నేర్వటం అన్నది అవశరమూ, విజ్ఞాన సముపార్జన ధ్యేయం కావాలే కానీ మోజు కాకూడదు. ఈ మోజులో పడి మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాషా సాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావి తరాలవారికి దీన్ని అందించడం ఆ భాషా సౌందర్యసంపదను కాపాడటం అందరి కర్తవ్యం.


శిశువుకి తొలి గురువు అమ్మ. ఆ అమ్మ ఒడి నుంచి నేర్చుకునే భాష మాతృభాష. అప్రయత్నంగా, ఏ ఇబ్బందీ లేకుండా నేర్చుకునే భాష ఇదే. దీని ద్వారానే రసానుభూతి, ఉత్తమ సంస్కారం, మానవతా విలువలు, సామాజిక నైతిక విలువలు పెంపొందుతాయి. భాష ఒక సమాజపు సొత్తు. ప్రతి తరం ఆ అద్భుత సంపదను కాపాడడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉండాలి. బిడ్డ శారీరకంగా ఎదగడానికి తల్లిపాలు ఎంత అవసరమో, మానసిక ఎదుగుదలకు అమ్మభాష కూడా అంతే అవసరం.


మా  పిల్లలు తెలుగులోనే మాట్లాడాలి, చదవాలి అనే భావన తల్లిదండ్రుల్లో రావాలి. వెర్రి ఆంగ్లమోజు తగ్గాలి. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచి భాష మనుగడకు ఉద్యోగ, ఉపాధి కల్పన చేసేలా పోరాడాలి. తెలుగు జాతిలో మరో భాష పరిరక్షణ ఉద్యమం స్వతంత్ర పోరాటాన్ని తలపించేలా చేయాలి. ‘‘మాతృభాష మాత్రమే మానవ పరిపూర్ణ వికాసానికి ప్రాణం పోస్తుందనేది’’ గొప్ప సత్యాన్ని మరవరాదు. కన్నడ, తమిళ రాష్ట్రాల పాలకుల భాషాభిమానాన్ని చూడండి! తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే, మాతృభాష ‘‘జ్ఞానాన్ని, సృజనాత్మకతను’’ పెంచుతుంది. ‘‘మాతృభాష కన్నయితే, ఆంగ్లభాష కళ్లజోడు లాంటిది.’’ అసలు కన్నంటూ ఉంటేగా కళ్లజోడుతో అవసరం ఉండేది!  ఇప్పటి తీరుగా భాషమనుగడను గాలికి జాలికి వదిలితే జాతి, సంస్కృతి అంతమవుతుందనేది మరవరాదు?


MATHRU BASHA DIWAS IN TELUGU INSTRUCTIONS










MATHRU BASHA DIWAS PROCEEDINGS

Top Post Ad

Below Post Ad