Type Here to Get Search Results !

APRS 5TH CLASS ADMISSION NOTIFICATION - 2022-23 - ONLINE APPLICATION

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ,

పాములపాటి శివయ్య కాంప్లెక్స్, కొరిటిపాడు, గుంటూరు.

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ (లాటరీ పద్ధతి ద్వారా 2022-23 విద్యా సంవత్సరానికి
5వ తరగతి ప్రవేశము కొరకు సమాచారము


ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న 38 సాధారణ. 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో (రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ [RCE] గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ, గుంటూరు జిల్లా మరియు కొడిగెనహళ్లి, అనంతపురం జిల్లాతో సహా) 2022-23 విద్యా సంవత్సరానికి గాను 5 వ తరగతి (ఇంగ్లీషు మీడియం) లో ప్రవేశమునకు విద్యార్థులను ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ (లాటరీ పద్ధతి ద్వారా తేది 10.06.22 ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాలల కేటాయింపు జరుగును.

APRS 5TH CLASS ADMISSION NOTIFICATION - 2022-23 - ONLINE APPLICATION

1. ప్రవేశానికి అర్హత:

  1. వయస్సు : ఓ.సి మరియు బి.సి (O.C, B.C) లకు చెందినవారు 01.09.2011 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2013 మధ్య పుట్టి ఉండాలి.
  2. సంబంధిత జిల్లాలో 2020-21 & 2021-22 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి. 
  3. O.C మరియు B.C విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో మాత్రమే చదివి ఉండాలి. S.C, S.T. మరియు మైనారిటీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతంలో చదివినప్పటికీ జనరల్/మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.
  4. ఆదాయపరిమితి అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సరాదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.

II. పాఠశాలలో ప్రవేశము:

  1. 2022-23 విద్యా సంవత్సరమునకు అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ, ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ (లాటరీ పధ్ధతి) ద్వారా, ఎంపిక చేయబడిన అధికారులతో కూడిన కమిటీ సమక్షంలో జరుపబడును.
  2. 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశములు పాత జిల్లాల స్థానికత ఆధారముగా
  3. ఒక జిల్లాలోని సాధారణ గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి ఆ జిల్లా(పాత జిల్లా)లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు. 
  4. ఒక జిల్లాలోని మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు కూడా పట్టిక (2) లో తెలిపిన విధముగా అర్హులు.
  5. ఈ క్రింది రీజినల్ సెంటర్స్ అఫ్ ఎక్సలెన్స్ (RCE) పాఠశాలల్లో అభ్యర్థి ఐచ్చికత, ప్రాంతము(పాత జిల్లా) మరియు రిజర్వేషన్ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించబడతాయి.a) తాడికొండ (గుంటూరు జిల్లా) 8 కోస్తా జిల్లాలవారు (నెల్లూరు తప్ప) అర్హులు. b) కొడిగెనహళ్లి (అనంతపురం జిల్లా ) - 4 రాయలసీమ జిల్లాలు & నెల్లూరు జిల్లా వారు అర్హులు.
  6. ఈ క్రింది పాఠశాలల్లో తప్ప, అన్ని సాధారణ (General) మరియు మైనారిటీ (Minority) పాఠశాలల్లో 80 సీట్లు నింపబడతాయి. పీలేరు, చిత్తూరు జిల్లా- 40 సీట్లు మాత్రమే, కర్నూలు (Minority-Boys), కర్నూల్ జిల్లా -40 సీట్లు మాత్రమే
  7.  సాధారణ (General) పాఠశాలల్లో గల సీట్లు సంబంధిత జిల్లాల (పాత జిల్లాలు) అభ్యర్థులకు మాత్రమే కేటాయించబడును. ఈ సీట్లకు అన్ని కేటగిరీల అభ్యర్థులు అర్హులు.
  8.  మైనారిటీ (Minority) పాఠశాలల్లో గల సీట్లు అర్హతగల జిల్లాల(పాత జిల్లాలు)లోని అన్ని మైనారిటీ, యస్.సి మరియు యస్.టి అభ్యర్థులకు మాత్రమే కేటాయించబడును.
  9. వేంపల్లి (Minority-Girls), కడప జిల్లా పాఠశాలలో సీట్లు కేవలం ముస్లిం మైనారిటీ, యస్.సి మరియు యస్.టి బాలికలకు మాత్రమే కేటాయించబడును.

పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపిక విధానం:

  1. ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ (లాటరీ పద్ధతి) ద్వారా ఎంపికైన అభ్యర్థుల రిజర్వేషన్ల వివరాలు పట్టిక (1) నందు ఇవ్వబడినవి.
  2. స్థానికత, ప్రత్యేక కేటగిరి (అంగవైకల్యం/అనాధ్/సైనికోద్యోగుల పిల్లలు) మరియు అభ్యర్థి కోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక జరుగును.
  3. ఏదేనీ ఒక రిజర్వేషన్ కేటగిరిలో అభ్యర్థులు లేని యెడల, అట్టి రిజర్వేషన్ ఖాళీలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం తదుపరి రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు కేటాయిస్తారు. కానీ మైనారిటీ పాఠశాలలకు చెందిన ఖాళీలను మైనారిటీ అభ్యర్థులతో మాత్రమే నింపుతారు.
  4.  ప్రత్యేక కేటగిరిలకు సంబంధించిన (అంగవైకల్యం, అనాధ మరియు సైనికోద్యోగుల పిల్లలు) ఖాళీలు మిగిలినచో, అట్టి ఖాళీలను మెరిట్ ||ప్రాతిపదికన ఓపెన్ క్యాటగిరి వారికి కేటాయిస్తారు.
  5. జిల్లాలవారీగా పాఠశాలల వివరాలు, ఆ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హతగల జిల్లాలు పట్టిక (2) నందు ఇవ్వబడినవి.
  6. ఎంపికైన అభ్యర్థులు ప్రవేశానికి అర్హులు కానిచో, అట్టి ప్రవేశాన్ని నిరాకరించుటకు సంస్థకు పూర్తి అధికారం ఉంది.

IV. దరఖాస్తు చేయు విధానం:

  1. అభ్యర్థులు తమ అర్హతలను మరియు నియమనిబంధనలను పూర్తిగా పరిశీలించుకొని సంతృప్తి చెందిన మీదట మాత్రమే దరఖాస్తు చేయవలెను.
  2. దరఖాస్తు ఆన్ లైన్ ద్వారా మాత్రమే సమర్పించగలరు. ది.09-05-2022 నుండి తేది.31-05-2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చును.
  3.  https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు రుసుము రూ. 50/- చెల్లించి, ప్రాధమిక వివరాలు (1. అభ్యర్థి పేరు, 2. పుట్టినతేది 3. మొబైల్ నెంబర్ మరియు 4. ఆధార్ నెంబర్ సమర్పించిన మీదట, అభ్యర్థికి తన ధృవీకరణ సంఖ్య ఇవ్వబడుతుంది.
  4.  ఆ ధృవీకరణ సంఖ్య ఆధారంగా https://aprs.apcfss.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను. ధృవీకరణ సంఖ్యను పరీక్ష ఫీజుకు చెందిన కాలమ్ లో నమోదు చేయవలెను.
  5. దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా నింపడానికి ముందుగా సంతకంతో కూడిన ఒక పాస్ పోర్ట్ సైజు (3.5cmx4.5cm) ఫోటోను సిద్ధము చేసుకొనవలెను.
  6. ఆధార్ నెంబర్ ను నమోదు చేయుటకు ఆధార్ కార్డు సిద్ధంగా ఉంచుకొనవలెను. 
  7.  పాఠశాలలు ఎంచుకొనడానికి ముందుగా పాఠశాలల వివరాల పట్టికను చూచుకొని నింపవలెను.
  8.  దరఖాస్తును నింపునపుడు అభ్యర్థి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయవలెను. ఒకసారి దరఖాస్తు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన తరువాత ఎలాంటి మార్పులకు అవకాశం లేదు. దరఖాస్తు నింపుటలో జరుగు పొరపాట్లకు అభ్యర్థియే పూర్తి బాధ్యత వహించవలసి ఉండును. తదుపరి ఏ విధమైన మార్పులు చేయబడవు. 
  9.  ఆన్ లైన్ లో దరఖాస్తును సమర్పించిన పిదప దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని ప్రవేశ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు అభ్యర్థి వద్ద ఉంచుకొనవలెను.
  10. దరఖాస్తు చేయు సమయానికి అభ్యర్థి కుల, ఆదాయ, ప్రత్యేక కేటగిరి, EWS ధృవీకరణ, స్టడీ మరియు బోనఫైడ్ ధృవీకరణ, పుట్టిన తేదీ ధృవీకరణ మొదలగు పత్రాలు పొందియుండాలి. ఒక వేళ దరఖాస్తు సమయానికి ఆయా పత్రాలు లేని వారు పైన తెలిపిన ధృవీకరణ పత్రాలు ప్రవేశ సమయానికల్లా పొంది యుండాలి. ధృవపత్రాల ఒరిజినల్స్ ప్రవేశ సమయంలో సమర్పించాలి. లేని యడల సదరు విద్యార్థి యొక్క ప్రవేశము రద్దు చేయు అధికారము సంబంధిత ప్రధానాచార్యులకు కలదు. 
  11. మైనారిటీల క్రింద ప్రవేశము పొందిన విద్యార్థులు తప్పనిసరిగా మైనారిటీకి చెందిన వారై ఉండాలి. లేని యెడల సంబంధిత విద్యార్థి యొక్క ప్రవేశమును రద్దుచేయు అధికారము ప్రధానాచార్యులకు కలదు. 
  12. EWS రిజర్వేషన్ క్రింద ప్రవేశము పొందిన విద్యార్థులు తప్పనిసరిగా G.O.Ms.No.60, Dt.27-07-2019, ప్రకారం సంబంధిత అధికారిచే జారీ చేయబడిన EWS కి చెందిన ధృవీకరణ పత్రము సమర్పించాలి. సమర్పించని యెడల సంబంధిత విద్యార్థి యొక్క ప్రవేశమును రద్దుచేయు అధికారము ప్రధానాచార్యులకు కలదు.
  13. ప్రత్యేక కేటగిరికి సంబంధించి ప్రవేశము పొందిన విద్యార్థులు తప్పనిసరిగా ఈ క్రింది ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. సమర్పించని యెడల సంబంధిత విద్యార్థి యొక్క ప్రవేశమును రద్దుచేయు అధికారము ప్రధానాచార్యులకు కలదు.

                a) PHC:- మెడికల్ బోర్డు చే జారీ చేయబడిన ధృవీకరణ పత్రం ప్రకారం కనీస వైకల్యం                     40% కలిగి ఉండాలి.

                b Orphan: అభ్యర్థికి తల్లిదండ్రులు లేరని సంబంధిత MRO చే జారీ చేయబడిన                                 ధృవీకరణ పత్రం ఉండాలి.

                C) CAP- అభ్యర్థి తండ్రి తప్పనిసరిగా మాజీ సైనికోద్యోగి లేదా ప్రస్తుతం రక్షణ సేవలో                         ఉన్నట్లు జిల్లా సైనిక్ బోర్డ్ ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రం ఉండాలి.

14. ఆన్ లైన్ లో కాక నేరుగా సంస్థకు గాని, గురుకుల పాఠశాలలకు గాని పంపిన దరఖాస్తులు పరిశీలించబడవు.

15. అర్హతలేని అభ్యర్థులు దరఖాస్తులు తిరస్క రించబడును.

16. దరఖాస్తు చేయు విధానంలో సందేహములు ఉన్నచో లేదా మరింత సమాచారము కొరకు కార్యాలయ పనివేళలలో ఉ. 10.00 నుండి సాయంత్రం 5.30 గం. లోపు. 9676404618 మరియు 7093323250 ఫోన్ నెంబర్ల లో సంప్రదించ గలరు.

PAYMENT START SATE : 09-05-2022

PAYMENT END DATE : 31-05-2022

APPLICATION START DATE : 09-05-2022

APPLICATION END DATE :  31-05-2022

APRS OFFICAL WEB SITE CLICK HERE 

DOWNLOAD APRS 5TH CLASS NOTIFICATION & SCHEDULE

DOWNLOAD APRS PRESS NOTE

ONLINE PAYMENT LINK click here

ONLINE APPLICATION FORM click here

Top Post Ad

Below Post Ad