Type Here to Get Search Results !

Anti-Corruption Bureau (ACB) 14400 App DOWNLOAD

 Anti-Corruption Bureau (ACB) 14400 App  DOWNLOAD

 Anti-Corruption Bureau (ACB) 14400 App  DOWNLOAD

Anti-Corruption Bureau (ACB) 14400 App

వివిధ ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అవినీతిని రూపు మాపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దిశ యాప్‌తో సంచలనం సృష్టించిన ప్రభుత్వం మరో అవినీతిపై కూడా అదేస్థాయిలో పోరాటానికి సిద్ధపడింది. దీనికి అనుగుణంగానే ఏసీబీ 14400 పేరుతో యాప్‌ను రూపొందించి ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అవినీతి నిర్మూలనకు ఏసీబీ తీసుకొచ్చిన సరికొత్త యాప్‌ను క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ప్రారంభించారు. స్పందనపై సమీక్షలో భాగంగా యాప్‌ స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎక్కడా అవినీతి ఉండకూడదనే మాటే చెబుతున్నామని.. ఆ దిశగానే కీలక నిర్ణయాలు తీసుకున్నామన్నారు సీఎం జగన్. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.1.41లక్షల కోట్ల మొత్తాన్ని లాంటి అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి అత్యంత పారదర్శకంగా పంపామన్నారు జగన్. ఎక్కడైనా, ఎవరైనా కూడా.. కలెక్టరేట్‌ అయినా, ఆర్డీఓ కార్యాలయం అయినా, సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసు అయినా, మండల కార్యాలయం అయినా, పోలీస్‌స్టేషన్‌ అయినా, వాలంటీర్, సచివాలయం, 108, 104 సర్వీసులు అయినా.. ఎవరైనా ఎక్కడైనా కూడా లంచం అడిగే పరిస్థితి ఉండకూడదన్నారు. అలా ఎవరైనా లంచం అని అడిగితే తమ చేతుల్లోని ఫోన్‌లోకి ఏసీబీ 14400 యాప్‌ను డౌన్లోడ్‌ చేసి... బటన్‌ ప్రెస్‌చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. వీడియో ద్వారా కాని, ఆడియో ద్వారా కాని సంభాషణను రికార్డు చేస్తే ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందన్నారు. అవినీతిని నిరోధించడానికి మరో విప్లవాత్మకమైన మార్పును తీసుకు వస్తున్నామన్నారు సీఎం జగన్. ఏసీబీ నేరుగా సీఎంఓకు నివేదిస్తుందన్నారు. ప్రతి కలెక్టర్, ఎస్పీకి అవినీతి నిరోధంలో బాధ్యత ఉందన్నారు. అవినీతిపై ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి అంకిత భావంతో అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. మన స్థాయిలో అనుకుంటే.. 50శాతం అవినీతి అంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. మిగిలిన స్థాయిలో కూడా అవినీతిని ఏరిపారేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అవినీతి లేని పాలన అందించడం అందరి కర్తవ్యం కావాలని తెలిపారు. ఎవరైనా పట్టుబడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

Anti-Corruption Bureau (ACB) 14400 App  DOWNLOAD

Anti-Corruption Bureau (ACB) 14400 App  DOWNLOAD

 

 14400 మొబైల్ యాప్ ఫీచర్లు :


► 14400 యాప్‌లో 'లైవ్ రిపోర్ట్' ఆప్షన్ కలదు.యాప్‌లోని లైవ్ రిపోర్టింగ్ ఫీచర్ ద్వారా అధికారులు, సిబ్బంది లంచాలు లేదా ఇతర అవినీతి అడిగే వారిపై తక్షణమే ఫిర్యాదు చేయవచ్చు. లైవ్ రిపోర్టింగ్ ఫీచర్‌లో ఫోటో, వీడియో, ఆడియో మరియు ఫిర్యాదు నమోదు ఎంపికలు ఉంటాయి. మీరు లంచం తీసుకుంటూ లైవ్ ఫోటో తీసి యాప్‌కి అప్‌లోడ్ చేయవచ్చు
► లంచం అడిగినప్పుడు మాటలను రికార్డ్ చేసి లైవ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు.
‌► లైవ్ వీడియో కూడా రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయవచ్చు.
► మీకు లైవ్ రిపోర్ట్‌కి యాక్సెస్ లేకపోతే, మీరు బాధితుడు ఇప్పటికే వ్రాసిన ఫిర్యాదు కాపీని, అలాగే సంబంధిత ఫోటోలు, ఆడియో మరియు వీడియో రికార్డింగ్‌లను యాప్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు.
► ఆ తర్వాత లాడ్జ్ కంప్లయింట్ (ఫిర్యాదు నమోదు) ఆప్షన్‌లోకి వెళ్లి సబ్‌మిట్ నొక్కితే ఫిర్యాదు ఏసీబీకి చేరుతుంది. ఫిర్యాదు చేసిన వెంటనే మెసేజ్ వస్తుంది.
► ఫిర్యాదు వెంటనే ఏసీబీ హెడ్‌క్వార్టర్స్‌లోని స్పెషల్ సెల్‌కు వెళుతుంది. అక్కడి సిబ్బంది ఫిర్యాదును జిల్లాలోని సంబంధిత ఏసీబీ విభాగానికి పంపుతారు.
► సంబంధిత అధికారులు వెంటనే ప్రభుత్వ అధికారి మరియు అతని సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్టు లేదా ఇతర క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.
► పై ప్రక్రియల అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తారు.
► కేసు పురోగతిని ఏసీబీ ఎప్పటికప్పుడు యాప్‌లో పోస్ట్ చేస్తుంది.

 14400 App is developed by Anti Corruption Bureau, GoAP for reporting corruption against the Public Servant.

https://play.google.com/store/apps/details?id=in.gov.ap.acb.citizen

Top Post Ad

Below Post Ad