HOW TO APPLY AP TEACHER MLC ELECTIONS VOTER REGISTRATION IN ONLINE -TEACHER MLC VOTER ENROLL 2022 - https://ceoandhra.nic.in/
ABOVE VIDEO LINK : https://youtu.be/wWGSJjJ5JzE
టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ ఎన్రోల్మెంట్
- ఉపాధ్యాయ నియోజకవర్గం ఓటరు నమోదు అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఓటరు నమోదుకు అర్హత ఉన్న ఉపాధ్యాయులందరూ ఓటు నమోదు చేసుకోవాలి. గతంలో నమోదు చేసుకున్న ఓట్లు చెల్లవు. కొత్తగా నమోదు చేసుకోవాలి.
- ఫారమ్ 19ని నింపి ఆ దరఖాస్తును నివాస అడ్రస్ ఆధారంగా ప్రభుత్వం నిర్దేశించిన మండల కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, అసిస్టెంట్ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్స్ (కలక్టరేట్) కార్యాలయాలలో ఇవ్వాలి.
- ఓటరు నమోదు మొదటి దశ కార్యక్రమం 2022 అక్టోబర్ 1 నుండి ప్రారంభమై నవంబర్ 7వరకు జరుగుతుంది.
- 2016 నవంబర్ 1 నుండి 2022 అక్టోబర్ 31 వరకు 6 సం॥ల కాలంలో 3 సం॥ల కాలం పనిచేసిన హైస్కూల్స్, కాలేజీలు, యూనివర్శిటీలలో పనిచేస్తున్న అధ్యాపకులు, ఉపాధ్యాయులు అందరూ టీచర్ ఓటరు. నమోదుకు అర్హులు
- దరఖాస్తు ఫారమ్ అసెంబ్లీ ఎన్నికల ఓటరు లిస్ట్లో ఉన్న దరఖాస్తుదారుని వివరాలు పొందుపర్చాలి. ముఖ్యంగా EPIC కార్డు (ఎలక్టోరల్ పాస్పోర్టు ఐడెంటికార్డు) నెంబర్ రాయాలి. వ్యక్తిగత దరఖాస్తులు బల్క్ గా తీసుకోరు. అయితే, విద్యాసంస్థ నుండి ఇచ్చిన దరఖాస్తులు ఆ సంస్థ హెడ్మాస్టర్ / ప్రిన్సిపల్ కవరింగ్ లెటర్తో బల్క్ నమోదు చేసుకోవచ్చు.
- ఓటును ఆన్లైన్లో కూడా నమోదు చేసుకోవచ్చు. ceoandhra.nic.in (Chief Electoral Offier - Andhra Pradesh) NVSP(National Voter's Service Portal) అనే వెబ్సైట్లో వుంటుంది.
- ఓటరు నమోదు అధికారికి దరఖాస్తు ఇచ్చిన తరువాత రశీదు తప్పనిసరిగా తీసుకోవాలి. దానిని దరఖాస్తు దారునికి అందించాలి.
- మనం నమోదు చేయిస్తున్న ఉపాధ్యాయ ఓటర్స్ యొక్క వివరాలు పట్టిక రూపంలో రిజిష్టర్ నిర్వహించాలి.
- అందులో వరుస సం,, పేరు, చిరునామా, డిగ్రీ, ఫోన్ నం., ఇమెయిల్, ఎవరి ద్వారా నమోదు అయింది అన్న వివరాలు వుండాలి. నమోదు చేసిన వారి సెల్ ర్ కూడా ఉండాలి. కాపీని బూత్ కమిటీ భద్రపరచాలి. మరొక కాపీ జిల్లా కేంద్రానికి పంపించాలి.
AP TEACHER MLC ELECTIONS VOTER REGISTRATION FORM 19 APPLY ONLINE LINK CLICK HERE
AP TEACHER MLC ELECTIONS VOTER REGISTRATION FORM 19 APPLICATION PDF DOWNLOAD
ABOVE VIDEO LINK : https://youtu.be/wWGSJjJ5JzE